బన్నీ ఆ బిజినెస్ లోకి దిగాడా...?

Update: 2020-03-21 11:36 GMT
టాలీవుడ్ లో అగ్ర కథానాయకుల హోదాలో కొనసాగుతున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. మెగా ఫ్యామిలీ గుర్తింపుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బన్నీ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టైలిష్ స్టార్ గా పిలవబడుతున్న బన్నీ తెలుగుతో పాటు మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల విడుదలైన 'అల వైకుంఠపురంలో' చిత్రం విజయంతో ఊపు మీదున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళ్తే బన్నీ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా మారాడంట. స్వతహాగా బిసినెస్ మ్యాన్ వారసుడైన బన్నీ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలు వ్యాపారాల్లో ఇన్వెస్టుమెంట్లు చేస్తున్నాడంట. దీనిలో భాగంగా కార్లను లీజ్ కి ఇచ్చే ఒక ఆటో మొబైల్ కంపెనీలో 8 కోట్లు పెట్టి 7 శాతం వాటాను కోలుగోలు చేసాడంట. ఈ కంపెనీ వాళ్ళు సెలెబ్రెటీల పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బ్రాండెడ్ కార్లను లీజుకు ఇస్తూ ఉంటారంట. ఈ వ్యాపారంలో బన్నీతో పాటు తెలంగాణాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయనాయకుడు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడని వినికిడి. రీసెంట్ గా వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఏపీ సీఎం జగన్ ని మీట్ అవడానికి వచ్చినప్పుడు ఈ కంపెనీయే అంబానీ రాకపోకలకు ఏర్పాట్లు చేసిందంట. దీనికి ఎయిర్పోర్ట్ నుండి సీఎం ఇంటి దాకా, అక్కడి నుండి తిరిగి ఎయిర్పోర్ట్ దాకా 8 కార్లను లీజుకు ఇచ్చారని సమాచారం.

ఏదేమైనా మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ పంథా మార్చుకుంటున్నారు. నాలుగురాళ్లు వెనకేసుకోవడానికి రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇది కొత్తేమీ కాదు, అప్పట్లో అక్కినేని నాగార్జున స్టార్ట్ చేసిందే. నటుడిగా బిజీగా ఉన్నప్పుడే వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన నాగార్జున సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది నాగార్జున బాటలోనే నడుస్తూ వ్యాపార రంగంలోకి దిగారు. అయితే వాళ్లలో కొందరు సక్సెస్ అవ్వగా మరికొందరు చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అదే దారిలో వెళ్తున్న బన్నీ వ్యాపారంలో కూడా సక్సెస్ అవ్వాలని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News