తెలుగు ప్రేక్షకులకు కబడ్డి కబడ్డి.. ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.. వసంతం సినిమాలతో పాటు ఇంకా పలు సినిమాలతో సుపరిచితురాలు గా మారిన కళ్యాణి ప్రేమ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత కళ్యాణి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. అక్కగా.. వదినగా.. అమ్మగా పలు సినిమాల్లో నటించిన కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేక పోయింది.
తెలుగు హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికి మంచి ఫేమ్ ను సొంతం చేసుకున్న కళ్యాణి సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోలేక పోయింది. ట్యాక్సీ వాలా మరియు యాత్ర సినిమాల్లో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన కళ్యాణికి ఆ తర్వాత మళ్లీ ఆఫర్లు రాలేదు. చిన్న సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కినా ఆమె కాదన్నట్లుగా సమాచారం అందుతోంది.
హీరోయిన్ గా.. నటిగా సుదీర్ఘ కాలం గా కెరీర్ ను కొనసాగిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న కళ్యాణి దర్శకురాలిగా మారింది. ఇప్పటికే ఒక సారి దర్శకురాలిగా తన అదృష్టంను పరీక్షించుకున్న కళ్యాణి ప్రస్తుతం చేతన్ చీను హీరోగా ఒక ప్యూర్ లవ్ స్టోరీ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగు లో నటుడిగా పలు సినిమాల్లో నటించిన చేతన్ హీరోగా బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో కళ్యాణి దర్శకత్వంలో ఆయన సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.
ఒక విభిన్నమైన ప్రేమ కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా కళ్యాణి చెబుతోంది. వాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టర్ లో హీరో చేతన్ బాత్ రూం లో పూర్తి నగ్నంగా.. చేతిలో సిగరెట్ పట్టుకుని బాధతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అతడిని చూస్తుంటే లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనిపిస్తుంది.
ఈ సినిమా లో కళ్యాణి దర్శకురాలిగా విభిన్నమైన అంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. నటిగా పలు విభిన్న పాత్రల్లో నటించిన కళ్యాణి ఈ సినిమా ను కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం.. కన్నడం మరియు మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది.
సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ల్లో రాబోతున్న ఈ సినిమా కు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. షూటింగ్ ఇంకా కొనసాగుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ లో పేర్కొనడం జరిగింది.