టాలీవుడ్ లో గత కొన్నేళ్ల క్రితం తనదైన మార్కు ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలతో సత్తా చాటి వరుస హిట్ లని సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ యంగ్ హీరో అడివి శేష్‌ని మోసం చేశారట. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ ఇండైరెక్ట్ గా వెల్లడించారు. అడివి శేష్ నటించిన తాజా మూవీ `మేజర్`. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని శశికిరణ్ తిక్క తెరకెక్కించారు. హీరో అడివి శేష్ కథ అందించిన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో రూపొందింది. అయితే తెలుగు, హిందీ భాషలతో పాటు ఈ మూవీని మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు.
పెద్ద సినిమాల కారనంగా ఇటీవల పలు దఫాలుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ కి రెండు వారాలు మాత్రమే వుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఇటీవల ట్రైలర్ ని విడుదల చేసిన సినిమాపై అంచనాల్ని పెంచేసిన మేకర్స్ బుధవారం రొమాంటిక్ సాంగ్ కి సంబంధించిన ఓ వీడియోని విడుదల చేశారు. ఈ సందర్భంగా అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న అడివి శేష్ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
కెరీర్ ప్రారంభం నుంచి స్టార్ హీరోలు తనని ఎంతగా సపోర్ట్ చేశారో చెప్పుకొచ్చారు. `పంజా` మూవీ టైమ్ లో పవన్ కల్యాణ్ చాలా సపోర్ట్ చేశారన్నారు. అంతే కాకుండా `క్షణం` మూవీ చూసి బన్నీ అభినందించారట. అలాగే `బాహుబలి` సినిమా సమయంలో ప్రభాస్ దగ్గరుండి చెప్పారట. ఇప్పడు `మేజర్` కు సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా సపోర్ట్ చేస్తున్నారన్నారు. ఇక 13 ఏళ్ల వయసులోనే కెమెరా ముందుకు పెట్టుకుని నటించడం మొదలు పెట్టానని అసలు సీక్రెట్ బయటపెట్టారు.
ఇక `బాహుబలి` లో తనకు అమ్మ ఎవరో చెప్పమని చాలా మంది అడుగుతున్నారని రాజమౌళితో అన్నారట. అది అనవరం అని, అంతే కాకుండా సినిమాలో భళ్లాలదేవుడి లాంటి రాక్షసుడికి నువ్వు పుట్టావు అంతే అన్నారట రాజమౌళి. దాంతో ఆయనని అడివి శేష్ మళ్లీ అడగలేదట. ఇదిలా వుంటే తనని నమ్మించి ఓ దర్శకుడు మోసం చేశాడని షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు అడివి శేష్.
అప్పుడు నాకు 15 ఏళ్లని. ఆ సమయంలో `చందమామ` చిత్రంలో నవదీప్ చేసిన పాత్ర కోసం ముందు తననే తీసుకున్నారని, రెండు రోజులు షూటింగ్ చేసిన తరువాత ఆ సినిమా ఆగిపోయిందని అదే సమయంలో తనకు `సొంతం` చిత్రంలో కీలక పాత్ర వుందని ఎవరో చెబితే వెళ్లి నటించానని, అయితే మూడు రోజులు షూటింగ్ అయిపోయిందని, తరువాత చూసుకుంటే సినిమాలో కేవలం 5 నిమిషాలు మాత్రమే తన పాత్ర వుందని, దాంతో తాను మోసపోయినట్టుగా గ్రహించానని తెలిపారు అడివి శేష్. `సొంతం` సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఆర్యన్ రాజేష్, నమిత హీరోయిన్ లుగా నటించారు.