స్టార్ డైరెక్ట‌ర్ తెలివిగా త‌ప్పుకున్నాడా? త‌ప్పించారా?

Update: 2022-08-22 04:37 GMT
టాలీవుడ్ లో చాలా వ‌ర‌కు  ప్రాజెక్ట్ లు బ‌డ్జెట్‌ హ‌ద్దులు దాటేస్తుంటాయి. 'బాహుబ‌లి' త‌రువాత చాలా మంది ప్రొడ్యూస‌ర్స్‌, డైరెక్ట‌ర్ కోట్ల బ‌డ్జెట్ ల‌తో సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. హీరో మార్కెట్ ని కూడా ప‌ట్టించుకోకుండా హ‌ద్దులు దాటి కోట్లు ఖ‌ర్చు చేయిస్తున్నారు. ఇది ఇప్ప‌డు ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు ప్ర‌ధాన అడ్డంకిగా మారిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమాకు మార్కెట్ ఏర్ప‌డ‌టండంతో మ‌న వాళ్లు బ‌డ్జెట్ ల‌ని హ‌ద్దులు దాటించేస్తున్నారు. అయితే హీరోకు మార్కెట్ వుంటే ఓకే రిట‌ర్న్స్ వ‌స్తాయి..

కానీ మార్కెట్ లేని హీరోకే దాదాపు 70 నుంచి 80 కోట్ల మేర ఖ‌ర్చు చేస్తే వారి ఆ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ గా మారుతుంది. ప్ర‌స్తుతం అఖిల్ అక్కినేని న‌టిస్తున్న 'ఏజెంట్' ఇదే త‌ర‌హాలో టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీగా మారింది.

స్టైలిష్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న స్టార్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుత ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో వుంది. అనిల్ సుంక‌ర‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కూడా వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

గ‌త కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన‌ట్టు తెలుస్తోంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ముందు రూ.30 కోట్ల‌తో పూర్తి చేయాల‌ని డెడ్ లైన్ పెట్టుకున్నార‌ట‌. ఆ ఒప్పందంతోనే సురేంద‌ర్ రెడ్డి నిర్మాణంలో భాగ‌స్వామిగా చేరార‌ట‌. అయితే అనుకున్న‌ది ఒక‌టి అయ్యింది ఒక‌టి అన్న‌ట్టుగా ఈ మూవీ బ‌డ్జెట్ ఇప్ప‌టికే రూ. 40 కోట్లు అయిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

మిగ‌తా స‌గం పూర్తి చేయాలంటే ఖ‌చ్చితంగా రూ. 30కోట్లు కావాల్సిందేని. అంతే కాకుండా ప‌బ్లిసిటీకి, వ‌డ్డీల‌కు క‌లిసి మ‌రో రూ. 10 కోట్లు అవుతాయ‌ని తెలుస్తోంది. అంటూ మొత్తం ఈ ప్రాజెక్ట్ కు అయ్యే ఖ‌ర్చు రూ. 80 కోట్లు. ఈ విష‌యం తెలిసి మ‌ధ్య‌లో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి నిర్మాణ భాగ‌స్వామి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన‌ట్టు తెలుస్తోంది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఐదు భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. థియేట్రిక‌ల్ రైట్స్‌, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ విష‌యంలో భారీ స్థాయిలో బిజినెస్ అయితే త‌ప్ప ఈ మూవీ ప్రొడ్యూస‌ర్ సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్టం అని ఇన్ సైడ్ టాక్‌. అఖిల్ కున్న మార్కెట్ ని బ‌ట్టి అది సాధ్య‌మ‌య్యేనా? అనే అనుమానాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యం తెలిసే ద‌ర్శ‌కుడు తెలివిగా త‌ప్పుకున్నాడా? అనే అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.
Tags:    

Similar News