స‌రైన ఆఫ‌ర్స్ లేకనే ఆ ముగ్గురూ ఓటీటీ బాట పట్టారా..?

Update: 2021-02-06 02:30 GMT
ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ "పిట్టకథలు'' అనే మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ రూపొందించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్స్ నాగ్‌ అశ్విన్‌ - బి.వి.నందిని రెడ్డి - తరుణ్ భాస్కర్‌ - సంకల్ప్‌ రెడ్డి ఈ సిరీస్ ని డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ ఆంథాలజీ ట్రైలర్ విడుదల కాబడి మంచి స్పందన తెచ్చుకుంటోంది. 'లస్ట్ స్టోరీస్' తరహాలో ఆధునిక స్వతంత్ర్య భావాలు కలిగిన మహిళల గురించి ఇందులో చూపించారు. అయితే ఈ సిరీస్ ని డైరెక్ట్ చేసిన వారిలో నాగ్ అశ్విన్ మినహా మిగతా దర్శకులు ముగ్గురూ.. పెద్ద హీరోలు - పెద్ద బ్యాన‌ర్లు అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోవ‌డం కార‌ణంగానే ఇప్పుడు ఓటీటీ బాట పట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి డైరెక్టర్ త‌రుణ్ భాస్క‌ర్ కి ఏ-సెక్ష‌న్ ఆడియెన్స్ లో మంచి పేరుంది. కానీ ఈ డైరెక్ట‌ర్ గత అయిదేళ్ల‌లో 'పెళ్లిచూపులు' 'ఈ నగరానికి ఏమైంది' వంటి రెండు సినిమాలకు మాత్ర‌మే దర్శకత్వం వహించాడు. అయితే ఆ తర్వాత చెప్పుకోద‌గ్గ పెద్ద‌వాళ్లెవ‌రూ ఈ డైరెక్ట‌ర్ కి అవ‌కాశాలు ఇవ్వలేదనే టాక్ వచ్చింది. ఇక డైరెక్టర్ నందిని రెడ్డి 'ఓ బేబి' సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. అయిన‌ప్ప‌టికీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంతవరకు రాలేదు. ఇక 'ఘాజీ' 'అంతరిక్షం' సినిమాల దర్శకుడు సంక‌ల్ప్ రెడ్డి తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు 'పిట్ల క‌థ‌లు' సిరీస్ ని డైరెక్ట్ చేసిన ఈ బ్యాచ్ లో నాగ్ అశ్విన్ త‌ప్పితే మిగ‌తా వారంతా స‌రైన ఆఫ‌ర్లు కోసం ఎదురుచూస్తున్న వారే అని చెప్పవచ్చు.






Tags:    

Similar News