ముగ్గురు టాప్ స్టార్స్ పాపులర్ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ని అడ్డంగా ముంచేశారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళ సినీ ఇండస్ట్రీలో పేరున్న టాప్ స్టార్స్.. అంటే కాకుండా అదే ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ కంపనీగా పేరున్న నిర్మాణ సంస్థ.. వీరంతా కాలసి బ్యాక్ టు బ్యాక్ ప్రముఖ ఓటీటీ దిగ్గజానికి చుక్కలు చూపించారట. భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకున్న వీరి చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యాయి. అయితే అవి బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాపులుగా మారడంతో ముందు చేసుకున్న ఒప్పిందం ప్రకారం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాలని సొంతం చేసుకోవాల్సి వచ్చింది.
అయితే థియేటర్లలో భారీ డిజాస్టర్ లుగా నిలిచిన ముగ్గురు టాప్ స్టార్స్ చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లోనూ ఆశించిన స్థాయిలో వీక్షకుల్ని ఆకట్టుకునే ఛాన్స్ లేకపోవడంతో నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాల వల్ల భారీ గానే నష్టాపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... తమిళ ఇండస్ట్రీలో పేరున్న టాప్ స్టార్స్ సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య, ఇళయదళపతి విజయ్ లతో తమిళ ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడక్షన్ కంపనీగా పేరున్న సన్ పిక్చర్స్ సంస్థ బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ చిత్రాలని నిర్మించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'అన్నాత్తే' నిర్మించింది. భారీ కాస్టింగ్ తో అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలైంది. సూపర్ స్టార్ రజనీ సినిమా వస్తోందంటే ఆ హంగామా వేరుగా వుంటుంది. కానీ ఈ చిత్రానికి ఆ హంగామా, ఆ బజ్ కనిపించలేదు. వెరసి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో అన్నట్టుగా రజనీ కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఈ మూవీ తరువాత ఇదే సన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ఈటీ (ఎవరికీ తలవంచడు). సూర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్ తెరకెక్కించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. అయితే దర్శకుడు ఈ కథని సమర్థవంతంగా ఆవిష్కరించడంతో విఫలం కావడంతో ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచి సన్ పిక్చర్స్ కు మరో ఫ్లాప్ ని అందించింది. అంత వరకు సూర్య బ్యాక్ టు బ్యాక్ రెండె సూపర్ హిట్ లని సొంతం చేసుకున్నాడు. అవి రెండు కూడా ఓటీటీలో విడుదదలై సూపర్ హిట్ లుగా నిలిచాయి,
అయితే మూడవ సినిమా ఈటీతో చాలా గ్యాప్ తరువాత థియేటర్లలోకి వచ్చాడు సూర్య అయితే కథ, కథనాలు పేలవంగా వుండటంతో ఈ మూవీ డిజాస్టర్ గా మారింది. ఈ మూవీ తరువాత సన్ పిక్చర్స్ చేసిన మరో భారీ చిత్రం 'బీస్ట్'. ఇళయదళపతి విజయ్ హీరోగా అత్యంత భారీ స్థాయిలో సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదలై విజయ్ కెరీకర్ లోనే అత్యంత డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఫలితాన్ని తట్టుకోలేని ఫ్యాన్స్ ఏకంగా ఓ థియేటర్ నే తగలబెట్టారంటే సినిమా ఏ స్థాయిలో వారిని డిజప్పాయింట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మూడు చిత్రాలని సన్ పిక్చర్స్ సంస్థ తన నెట్ వర్క్ కి చెందిన సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కి ఇచ్చేసింది. దీంతో పాటు నెట్ ఫ్లిక్స్ కి కూడా భారీ మొత్తాన్ని అమ్మేసింది. భారీ నిర్మాణ సంస్థ. స్టార్ హీరోలు చేసిన సినిమాలు కావడంతో నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఈ చిత్రాల స్ట్రీమింగ్ హక్కుల్ని సొంతం చేసుకుందట. ఇప్పటికే ఈ సంస్థ నుంచి తీసుకున్న రెండు చిత్రాలు 'అన్నాత్తే, ఈటీ పెద్దగా ఆకట్టుకోలేక నెట్ ఫ్లిక్స్ కి భారీ నష్టాలని అందించాయట. తాజాగా 'బీస్ట్' కూడా డిజాస్టర్ కావడంతో నెట్ ఫ్లిక్స్ వర్గాలు తలపట్టుకుంటున్నాయట. ఈ సినిమా కారణంగా భారీగానే సబ్స్ స్క్రీప్షన్ పెరిగినా సంస్థ భారీ నష్టాలని చవిచూడటం గమనార్హం.