శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన '2.0' రీసెంట్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలయిన ఈ సినిమాను సాధారణ ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'ఇదో సినిమాటిక్ జెమ్ అని.. దర్శకుడు శంకర్ నెక్స్ట్ లెవెల్ లో సినిమా తీశాడని' ప్రశంసించాడు. '2.0' టీమ్ అందరికీ అభినందనలు తెలిపాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు మహేష్ బాబు ట్వీట్ ను ప్రస్తావిస్తూ.. ఈ సినిమా మహేష్ తనయుడు గౌతమ్ కు కూడా నచ్చిందని కాకపొతే గౌతమ్ ఈ సినిమాను 2D వెర్షన్ చూశాడని అన్నాడు. అందుకే పిల్లలకోసం 3D వెర్షన్ స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నానని తెలిపాడు. పిల్లలకు కనుక సినిమా నచ్చిందంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ కూడా సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయని అన్నాడు. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని.. సంక్రాంతి వరకూ థియేటర్లలో ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఏదేమైనా దిల్ రాజు ఐడియా మాత్రం బాగుంది. సెలెబ్రిటీ పిల్లల కోసం ఒక షో ప్లాన్ చేస్తే.. సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుంది. చూస్తుంటే ఈ ఐడియా విజయ్ దేవరకొండను చూసి ఇన్ స్పైర్ అయిన ఐడియా లాగా అనిపించడం లేదూ? ఈమధ్య విజయ్ దేవరకొండ తన నివాసంలో సెలబ్రిటిల పిల్లలకోసం ఒక గెట్ టుగెదర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా.