సినిమా అంటే.. కోట్ల రూపాయలతో ముడిపడ్డ జూదం. ఇక్కడందరూ సక్సెస్ వెంటే పరుగులు తీస్తారు. అనుభవం ఉన్నవాళ్లకే ఓటేస్తారు. కానీ దిల్ రాజుది మాత్రం ఆ విషయంలో భిన్నమైన దారి. ఆయన కొత్త దర్శకులపై నమ్మకముంచుతాడు. ఫెయిల్యూర్లను పట్టించుకోడు. ఇప్పటిదాకా దిల్ రాజు బేనర్ నుంచి ఎనిమింది మంది దర్శకులు పరిచయమయ్యారంటేనే ఆయన ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు తన బేనర్లో ఫ్లాపులిచ్చిన వంశీ పైడిపల్లి - హరీష్ శంకర్ - వాసు వర్మ - వేణు శ్రీరామ్ లాంటి వాళ్లకు మళ్లీ అవకాశాలివ్వడం రాజుకే చెల్లింది. ‘జోష్’ లాంటి ఫ్లాప్ తో అరంగేట్రం చేసిన వాసు వర్మతోనే ఇప్పుడు ‘కృష్ణాష్టమి’ తీశాడు. ‘ఓ మై ఫ్రెండ్’ తీసిన వేణు శ్రీరామ్ తో ‘ఎవడో ఒకడు చేస్తున్నాడు.
ఎవరైనా ఒక ఫ్లాప్ తీసిన దర్శకుడిని దూరం పెడతారు.. కానీ రాజు ఏంటి ఇలా చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయే వారికి ‘కృష్ణాష్టమి’ ఆడియో వేడుకలో సమాధానం ఇచ్చాడు రాజు. ‘‘సినిమా అనేది మాకు పెద్ద వీక్ నెస్. అలాగే సినిమాని సక్సెస్ చేయాలన్నది కూడా వీక్ నెస్సే. క్రిష్టాష్టమి సక్సెస్ అవ్వాలి. మా సంస్థ కోసం కాదు డైరెక్టర్ వాసు వర్మ కోసం. అతడికి టాలెంట్ ఉంది. మా సంస్థ నుంచి అతడికి మంచి సక్సెస్ ఇచ్చే పంపించాలనుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ వేణు శ్రీరామ్ ని కూడా సక్సెస్ ఇచ్చే పంపిస్తాను’’ అని తనదైన శైలిలో చెప్పాడు రాజు. ఇలా దర్శకులకు లైఫ్ రావాలని తపించే నిర్మాతలు అరుదుగా ఉంటారు. మరి వాసు వర్మకు సక్సెస్ ఇచ్చి తీరుతానన్న రాజు శపథం నెరవేరుతుందో లేదో ఫిబ్రవరి 5న తేలుతుంది. ఎందుకంటే ఆ రోజే ‘కృష్ణాష్టమి’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.