అంత నమ్మకమా రాజు గారు

Update: 2018-04-24 17:30 GMT
తన బ్యానర్ లో తీసినవి కాకుండా బయటి సినిమాలు కొనే విషయాల్లో చాలా క్యాలికులేటెడ్ గా ఉంటాడని పేరున్న దిల్ రాజు లెక్కలు ఈ మధ్య కొంచెం దారి తప్పుతున్నాయి. నాని డ్యూయల్ రోల్ చేసిన కృష్ణార్జున యుద్ధం చేదు ఫలితాన్ని ఇవ్వగా లాస్ట్ ఇయర్ తాను దగ్గరుండి మరీ రిపేర్ చేయించిన జవాన్ సూపర్ ఫ్లాప్ అయ్యింది. మణిరత్నం చెలియా విషయంలో కూడా లెక్క తప్పి డిజాస్టర్ మిగిలింది. అంతకుముందు నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అవుతుంది. కాని అవేవి పట్టించుకోవద్దు అంటున్నాడు దిల్ రాజు మెహబూబా విషయంలో . పూరి మంచి కథ రాసుకున్న ప్రతిసారి సక్సెస్ అయ్యాడని మెహబూబా కూడా అదే కోవలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసాడు. సినిమా చూసాకే కొనాలన్న నిర్ణయం తీసుకున్నాను అని చెప్పిన దిల్ రాజు మెహబూబాకు సంబంధించి రెండు రాష్ట్రాల హక్కులను పూర్తిగా కొనేసాడు.

టీజర్ తో బాగానే అటెషన్ లాగేసిన మెహబూబా ఇండో పాక్ జంట మధ్య ప్రేమ కథగా రూపొందింది. బోర్డర్ నేపధ్యంలో తెలుగులో సినిమాలు రావడం చాలా అరుదు. ఆ రకంగా దీని మీద ప్రేక్షకుల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. తన రొటీన్ బ్యాంకాక్ మాఫియాకు పూరి తీసిన ప్యూర్ లవ్ స్టొరీ ఇది. ఆకాష్ కూడా లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దిల్ రాజు అండ ఉంది కాబట్టి రిలీజ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో పాటు థియేటర్లు కూడా బాగా దక్కుతాయి. ఇది కనక హిట్ కొడితే పూరి మళ్ళి ట్రాక్ లో పడినట్టే. చాలా కాలం తర్వాత సందీప్ చౌతా తెలుగు మూవీకి పూర్తి స్థాయి సంగీతం అందించడం కూడా మరో ఆకర్షణ. నిన్న విడుదలైన ఆడియో సింగల్ ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. మరి దిల్ రాజు నమ్మకం ఈ సారి నిలుస్తోందో లేదో తెలియాలంటే మే 11 దాకా ఆగాలి.
Tags:    

Similar News