దిల్ రాజు కోటిన్నర వడ్డీ కట్టాడట

Update: 2016-02-18 07:29 GMT
టాలీవుడ్ లో తరచుగా ‘ఆ నలుగురు నిర్మాతలు’ అనే మాట చర్చలోకి వస్తూ ఉంటుంది. ఆ నలుగురు నిర్మాతలు థియేటర్లను గుప్పెట్లో పెట్టేసుకున్నారని.. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వరని.. వాళ్లదే మోనోపలీ అని విమర్శలు వ్యక్తమవుతుంటాయి. ఆ నలుగురిలో ఒకడిగా దిల్ రాజు పేరు కూడా వినిపిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సైతం ఈ విమర్శల గురించి, ఆరోపణల గురించి మాట్లాడ్డానికి ఏమీ మొహమాట పడడు. తాజాగా మరోసారి ఆయన ఈ మోనోపలీ గురించి మాట్లాడాడు. తాను కూడా అందరి లాంటి నిర్మాతనే అని.. అందరికీ ఉన్న కష్టాలే తనకూ ఉన్నాయని అంటున్నాడు రాజు. ‘కృష్ణాష్టమి’ రిలీజ్ విషయంలో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ఆయన వివరించాడు.

‘‘నేనేదో మోనోపలీ చేస్తున్నానని చాలా మంది అంటున్నారు కానీ.. అదే నిజమైతే గత ఏడాది ఆగస్టులో పూర్తయిన ‘కృష్ణాష్టమి’ ఇప్పటిదాకా ఎందుకు రిలీజ్ కాలేదు? నేను అప్పుడే రిలీజ్ చేసుకుని ఉండొచ్చు కదా.. ఎందుకు చేయలేదు? మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూశాను. ఇది అందరికీ ఎదురయ్యే ఇబ్బందే. ఆరు నెల‌లు సినిమా ఆపుకోవడం వల్ల‌ కోటిన్నర రూపాయలు వడ్డీ కూడా కట్టాను. ఏదో సినిమా రిలీజ్‌ చేసేయాలని  చేయలేం. మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేయాలి. ఈ ఇబ్బంది అందరికీ ఉంటుంది. దానికి ఇంకెవరినో బ్లేమ్ చేస్తే లాభం లేదు’’ అని చెప్పాడు. దిల్ రాజు లాంటి వాడు ఆరు నెలలు సినిమా ఆపుకుని ఫైనాన్షియర్లకు కోటిన్నర రూపాయల వడ్డీ కట్టడమంటే మామూలు విషయం కాదండోయ్.
Tags:    

Similar News