పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్ అనేది జూదం లాగా మారిపోయింది ఈ రోజుల్లో. ఈ ఏడాది ‘స్పైడర్’.. ‘కాటమరాయుడు’.. ‘డీజే’.. ‘జైలవకుశ’ లాంటి సినిమాలు బయ్యర్లకు చేదు అనుభవం మిగిల్చాయి. వీటిలో తొలి రెండు సినిమాలు దారుణ ఫలితాన్నందుకోగా.. మిగతా రెండు పర్వాలేదనిపించాయి కానీ.. అవి కూడా కొంత మేర బయ్యర్లకు నష్టాలే తెచ్చిపెట్టాయి. పెద్ద సినిమాలతో ఉన్న ఈ ప్రమాదం గురించి తెలిసినా.. డిస్ట్రిబ్యూటర్లు టెంప్టేషన్ తగ్గించుకోలేరు. కాంబినేషన్ క్రేజ్ చూసి సినిమాను అయినకాడికి కొని నష్టపోతుంటారు. ఈ వలలో దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కూడా పడటం ఆశ్చర్యం కలిగించే విషయమే.
దిల్ రాజుకు ఈ ఏడాది ‘ఓం నమో వేంకటేశాయ’ దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. దీని తర్వాత ఆయనకు ‘జై లవకుశ’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని రాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే పెద్ద సినిమాలు తగ్గించుకుని చిన్న-మీడియం సినిమాలపై ఆయన ఫోకస్ పెట్టాడు. తాజాగా ఆయన ‘తొలి ప్రేమ’.. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాల్ని హోల్ సేల్ గా కొనేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. వరుణ్ ‘ఫిదా’తో బ్లాక్ బస్టర్ కొట్టిన నేపథ్యంలో ‘తొలి ప్రేమ’పై మంచి అంచనాలున్నాయి. కాబట్టి ఆ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.18 కోట్లకు తీసేసుకున్నాడట రాజు. ఇక నాని సంగతి చెప్పాల్సిన పని లేదు. భీకర ఫామ్ లో ఉన్నాడతను. దీంతో అతడి సినిమాకు రూ.23 కోట్లు పెట్టాడట రాజు. వీళ్లిద్దరి ఫామ్ ప్రకారం చూస్తే.. ఈ రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని.. ఈజీగా సేఫ్ జోన్లోకి వచ్చేయొచ్చని అంచనా వేస్తున్నాడు రాజు. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.