స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గత కొంత కాలంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నుంచే విజయ్ తో భారీ ప్రాజెక్ట్ చేయాలని కొంత మంది రైటర్ లని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కథలు సిదకధంచేయించారు. అయితే అందులో ఏ స్టోరీ కూడా విజయ్ కి సెట్ కాకపోవడంతో దిల్ రాజు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఇదిలా వుంటే విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా అంటూ ప్రనకటించాడు దిల్ రాజు.
అది ఎంతకీ పట్టాలెక్కకపోవడంతో దర్శకుడు శివ నిర్వాణ అదే ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ తో చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మూవీ 'ఖుషీ'. ఇదే సినిమాని దిల్ రాజు చేయాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ కి వెళ్లిపోయింది. దీంతో విజయ్ దేవరకొండతో దిల్ రాజు చేయాల్సిన ప్రాజెక్ట్ మళ్లీ పెండింగ్ లో పడిపోయింది.
ఇదిలా వుంటే 'లైగర్' ఫ్లాప్ తరువాత విజయ్ దేవరకొండ 'ఖుషీ' మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు తాజాగా మరో ప్రాజెక్ట్ ని అంగీకరించినట్టుగా వార్తులు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చేయబోతున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి స్టోరీ వినిపించారని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని, ఈ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నారని తెలిసింది.
అయితే దిల్ రాజు మాత్రం ఈ ప్రాజెక్ట్ కు కండీషన్ పెట్టారట. గౌతమ్ తిన్ననూరి లైన్ వినిపించినా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రమ్మని, పూర్తి స్థాయి స్టోరీని విన్న తరువాతే ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారట. ఇదే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ఇటీవల శివ నిర్వాణతో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించిన దిల్ రాజు ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టడంతో శివ నిర్వాణ మైత్రీ మూవీ మేకర్స్ వారికి చెప్పడం వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అది 'ఖుషీ'గా సెట్స్ పైకి వెళ్లింది.
మళ్లీ అదే పంథాలో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కు దిల్ రాజు ట్విస్ట్ ఇవ్వరుగా అని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి అదే జరిగితే దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా చేయడం కలే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ - శంకర్ ల కలయికలో RC 15 ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన సాంగ్ షూటింగ్ త్వరలో న్యూజిలాండ్ లో జరగబోతోంది. ఇందు కోసం టీమ్ న్యూజిలాండ్ కు వెళ్లడానికి రెడీ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.