టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. నిర్మాతగా తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన గ్యాప్ తీసుకోకుండా ముందుకు వెళుతున్నారు. సినిమాల నిర్మాణంలో లాభనష్టాలు సహజం. నష్టాలు ఎదురైనా ఆయన తనపట్ల తనకి గల నమ్మకాన్ని కోల్పోలేదు. అలాగే యూత్ .. మాస్ .. ఫామిలీ ఆడియన్స్ .. ఇలా అందరికీ కూడా వేరు వేరు జోనర్లలోనూ, అందరికీ నచ్చిన అంశాలను ఒక కథలోనే ఉండేలా చూసుకుంటూ సినిమాలను నిర్మిస్తున్నారు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ ఆయన దూసుకుపోతున్నారు.
ఆయన తాజా చిత్రంగా నిర్మితమైన 'థ్యాంక్యూ' .. ఈ నెల 22వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ .. తాను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. సినిమాల్లోకి రావడానికి ముందు తాను చేసిన వ్యాపారాలను గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో తనకి సహకరించిన వారెవరినీ తాను మరిచిపోలేదని చెప్పారు. ఈ వేదిక ద్వారా కూడా వాళ్లకి థ్యాంక్స్ చెప్పవలసిన బాధ్యత తనకి ఉందని అన్నారు.
తాను ఇక్కడివరకూ రావడానికి వెనుక ఎంతోమంది ప్రోత్సాహం ఉందని అన్నారు. తన తల్లిదండ్రులు తనకి మంచీ చెడు చెబుతూ సక్రమమైన మార్గంలో నడిపించారనీ .. తాను ముందుకు వెళ్లడానికి తన తోబుట్టువులు సహకరించారని చెప్పారు. ఈ ప్రయత్నంలో తన స్నేహితుల పాత్ర కూడా ఎక్కువగానే ఉందనీ .. ఈ వేదిక ద్వారా వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. తన ప్రయాణంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయనీ .. అలాగే సక్సెస్ లు ఉన్నాయని చెప్పారు. డిస్ట్రి బ్యూటర్ గా ఉన్నప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో చాలా ఇబ్బందులు .. కష్టాలు పడ్డానని అన్నారు.
కష్టాలు ఎదురైనప్పుడు ఓపికతో మనలను ముందుకు నడిపించేది భార్య మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో నా భార్య 'అనిత' నాకు అండగా నిలిచింది. 27 సంవత్సరాల మా జర్నీలో ఎన్నో ఇబ్బందులను దాటుకుని నేను ముందుకు వెళ్లడానికి తాను కారణమైంది. ఈ సందర్భంగా ఆమెకి థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ఆ తరువాత తనని తాను కంట్రోల్ చేసుకుంటూ .. 'దిల్' సినిమాతో తనకి హిట్ ఇచ్చిన వీవీవినాయక్ గారిని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. నిర్మాతగా తన కెరియర్లో 50 సినిమాలను పూర్తి చేశాననీ .. అందుకు సంబంధించిన ప్రతి ఒక్కరికీ తాను థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు.