ఫేస్ బుక్ లో 'డిజె'.. క్రిమినల్ కేసులే

Update: 2017-06-26 11:22 GMT
కాదేదీ పైరసీకి అనర్హం అన్నట్లు తయారైంది మన సొసైటి. అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సినిమాలను పైరసీ చేస్తూనే ఉన్నారు. బాహుబలి సినిమా ఇండియా షో పడకముందే.. వాట్సాప్ లో చాలా క్లిపులు వచ్చేశాయి. ఇప్పుడు అల్లు అర్జున్ 'డిజె దువ్వాడ జగన్నాథమ్' విషయంలో కూడా ఈ పైరసీ భూతం పిచ్చి డ్యాన్సులు వేస్తోంది.

ప్రస్తుతం కొన్ని ఫేస్ బుక్ ఎకౌంట్స్ ద్వారా డిజె పైరసీ కాపీని నెట్టింట సర్కులేట్ చేస్తున్నారు కొందరు ఆగంతకులు. పైగా అది కూడా ప్రతీ సీన్ ను వర్ణిస్తూ.. ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తూ.. సినిమాకు డ్యామేజ్ చేసే విధంగా మాటలు పేలుస్తూ.. వాటిని షేర్ చేస్తున్నారట. ఇదే విషయం దిల్ రాజు వరకు వెళ్లడంతో వెంటనే వారు సైబర్ క్రైమ్ వారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. పైరేటెడ్ కాపీని ఎక్కడ అప్ లోడ్ చేసినా కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాం అంటూ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. అందరి మీదనా క్రిమినల్ కేసులు పెడతాం అంటూ హరీశ్‌ శంకర్ కూడా పేర్కొన్నాడు.

ఇకపోతే సోమవారం నాడు రంజాన్ సెలవు కావడంతో డిజె కలక్షన్లకు ఢోకా లేకుండా బండి నడుస్తోంది. మంగళవారం నాటి బుకింగ్స్ అన్నీ చూస్తే కాని.. డిజె తాలూకు అసలు సత్తా ఏంటో తెలుస్తుంది. దాదాపు 80 కోట్లు వసూలు చేస్తేనే డిజె డిస్ర్టిబ్యూటర్లు సేఫ్‌ అనేది ట్రేడ్ వర్గాల మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News