దిల్ రాజుకు ఈ మధ్య తమిళ సినిమాల మీద బాగా మనసు మళ్లుతోంది. గత ఏడాది మణిరత్నం సినిమా ‘ఓకే బంగారం’ను తెలుగులోకి అందించాడు రాజు. నిర్మాతగా మారాక రాజు.. డిస్ట్రిబ్యూట్ చేసిన తొలి తమిళ డబ్బింగ్ సినిమా అదే. ‘ఓకే బంగారం’ మంచి ఫలితాన్నివ్వడంతో ఈ ఏడాది విజయ్ మూవీ ‘తెరి’ని ‘పోలీస్’గా తెలుగులోకి తీసుకొచ్చాడు రాజు. అది అంతగా ఆకట్టుకోలేదు.
ఐతే ఇప్పుడు రాజు నుంచి మరో తమిళ అనువాదం రాబోతోంది. ఆ సినిమానే.. రెమో. యువ కథానాయకుడు శివ కార్తికేయన్ - లక్కీ గర్ల్ కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ఇది. గత రెండు మూడేళ్లలో హీరోగా భలే ఎదిగాడు శివ కార్తికేయన్. బుల్లితెర యాంకర్‌గా ప్రస్థానం ఆరంభించి.. అరడజను సినిమాలతోనే స్టార్ అయిపోయాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అతడి సినిమా ‘రజినీ మురుగన్’ దాదాపు రూ.50 కోట్లు వసూలు చేసింది. అందులోనూ శివకార్తికేయన్ సరసన కీర్తి సురేషే హీరోయిన్ గా నటించడం విశేషం.
భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ‘రెమో’ను 24 ఏఎం స్టూడియోస్ నిర్మించింది. ఆ సంస్థతో కలిసి తెలుగులోకి దీన్ని తెస్తున్నాడు రాజు. ఈ చిత్రం తమిళంలో దసరా కానుకగా అక్టోబరు 7న విడుదల చేస్తున్నారు. ఐతే తెలుగు వెర్షన్ పనులు ఇప్పుడే మొదలైనట్లున్నాయి. పైగా దసరాకు తెలుగులో విపరీతమైన పోటీ ఉంది. కాబట్టి తెలుగు వెర్షన్ ఇప్పుడే రిలీజ్ కాకపోవచ్చు. ఐతే లేటుగా రిలీజ్ చేస్తే టాక్ తెలిసిపోతుంది. తమిళంలో నెగెటివ్ టాక్ వచ్చిందంటే.. ఇక తెలుగులో రిలీజ్ చేసినా ఫలితం ఉండదు. అసలే శివకార్తికేయన్ మనకు పరిచయం కూడా లేడు మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/