ఈ మధ్య దాసరి మారుతి సినిమాల్లో కొంచెం మార్పు వచ్చింది కానీ.. అంతకుముందు అతడి సినిమాలన్నీ అదో టైపులో ఉండేది. ముఖ్యంగా అమ్మాయిల్ని మారుతి చూపించే విధానం మీద చాలా అభ్యంతరాలున్నాయి. ఈ తరం అమ్మాయిల్లో స్పీడెక్కువైపోయిందన్న విషయాన్ని తన పాత్రల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు మారుతి. కొన్నిసార్లు ఆ పాత్రలు కొంచెం శ్రుతి మించి పోతుంటాయి కూడా. మధ్యలో ఇలాంటి పాత్రల విషయంలో కొంచెం తగ్గిన మారుతి.. ఇప్పుడు ‘రోజులు మారాయి’లో మరోసారి తన ముద్ర చూపిస్తున్నట్లుగా ఉన్నాడు. దీని ట్రైలర్ చూస్తే అమ్మాయిల పాత్రల్ని చెడుగానే ప్రొజెక్ట్ చేసినట్లు కనిపిస్తోంది. అసలీ సినిమా కాన్సెప్టే ఈ తరం అమ్మాయిలు మామూలోళ్లు కాదు అని చెప్పడమే ఉద్దేశం అన్నట్లు కనబడుతోంది.
మారుతికి ఉన్న బ్రాండ్ ప్రకారం చూస్తే అతడికి కొత్తగా వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రాలు చేస్తాడని పేరున్న దిల్ రాజు.. ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి కావడంతోనే అనుమానాలు కొడుతున్నాయి. మరి ఇదే విషయం రాజు దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘ఇప్పటి వరకు అబ్బాయిల కోణంలోనే సినిమాలొచ్చాయి. ఇది అమ్మాయిల కోణంలో తెరకెక్కిన సినిమా. అలాగని అమ్మాయిను తప్పుగా చూపించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూపించాం. నలుగురు వ్యక్తుల మధ్య నడిచే కథ ఇది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఇతివృత్తం. మారుతి బౌండెడ్ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టాక సినిమా ప్రారంభించాం. మురళీకృష్ణ చక్కగా తెరకెక్కించాడు. జులై 1న రాబోయే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నాడు.