ఆ ఎదురు దెబ్బలపై దిల్ రాజు ఓపెనయ్యాడు

Update: 2017-12-19 05:33 GMT
డిస్ట్రిబ్యూషన్ నుంచి నిర్మాణంలోకి అడుగుపెట్టి టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు దిల్ రాజు. అయితే నిర్మాత అయ్యాక కూడా డిస్ట్రిబ్యూషన్ ఏమీ ఆపలేదు. ఒక ఏడాదిలో రాజు నిర్మించే సినిమాల కంటే డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నైజాం ఏరియాలో ఇప్పటికీ ఆయనే నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్. ఐతే సినిమాల ఎంపికలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తాడు రాజు. అలాంటి వ్యక్తికి ఈ ఏడాది కొన్ని పెద్ద ఎదురు దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ఏడాది ఆరంభంలో ‘నమో వేంకటేశాయ’.. ఈ మధ్య ‘స్పైడర్’ రూపంలో చేదు అనుభవాలు మిగిలాయి. డిస్ట్రిబ్యూటర్ గా ఇంత పెద్ద షాకులు తినడంపై ఒక ఇంటర్వ్యూలో  ఓపెనయ్యాడు రాజు.

‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాను సెంటిమెంటుతోనే భారీ ధరకు కొని రిలీజ్ చేసినట్లు రాజు వెల్లడించాడు. వేంకటేశ్వరస్వామి తమ కుల దైవమని.. తాను ఆయనకు పెద్ద భక్తుడినని.. కాబట్టే ఈ చిత్రాన్ని తాను పంపిణీ చేశానని రాజు చెప్పాడు. ఇక ‘స్పైడర్’ సినిమా మంచి కాంబినేషన్ అన్న నమ్మకంతోనే కొన్నానని.. అది కూడా దెబ్బ తీసిందని రాజు తెలిపాడు. తాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రకరకాల కారణాలుంటాయని.. కేవలం ప్రాజెక్టు మీద నమ్మకంతోనే కాక సెంటిమెంటుతో.. మొహమాటాలతో కూడా కొన్ని సినిమాలు తీసుకోవాల్సి ఉంటుందని రాజు తెలిపాడు. ఐతే ఈ ఏడాది తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా డిస్ట్రిబ్యూషన్లో కొంచెం దూకుడు తగ్గించాలని తాను నిర్ణయించుకున్నానని రాజు చెప్పాడు. సొంత నిర్మాణంలో తెరకెక్కే సినిమాలైతే అన్నీ తానే ఇన్వాల్వ్ అయి చూసుకుంటానని.. బయటి సినిమాల విషయంలో అలా ఉండదని.. ఇకపై కొంచెం జాగ్రత్తగా ఉండాలని డిసైడయ్యానని రాజు అన్నాడు.
Tags:    

Similar News