టాలీవుడ్ లో అరుదుగా వచ్చే సినిమాలు ఏమైమ ఉన్నాయంటే అది మల్టీ స్టారర్ అనే చెప్పాలి. తెలుగులో దాదాపు వంద కోట్లు కొల్లగొట్టే స్టార్స్ ఉన్నా ఇంకా ఇద్దరు బడా హీరోలు కలిసి ఓ సినిమాను చేయడం కుదరడం లేదు. అప్పుడప్పడు వెంకీ లాంటి వారు ట్రై చేస్తున్నా అభిమానులు ఇంకా అంతకు మించి అని కోరుకుంటున్నారు.
ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా ఓ మినీ మీడియం హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నడట డైరెక్టర్ హరీష్ శంకర్. డీజే సినిమా హిట్ అని చెప్పి చివరికి నెగిటివ్ టాక్ నే తెచ్చుకొని విమర్శలను మూటగట్టుకున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని ఓ మీడియం హీరోలతో తియ్యడానికి డిసైడ్ అయ్యాడట. అయితే ఆ సినిమాలో నాని-శర్వానంద్ ని సెట్ చేయించి సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కించేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయట. అలాగే మరో ఇద్దరు హీరోల పేర్లు కూడా తెగ వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలి నుంచి సాయి ధరమ్ తేజ్ మరియు వరుణ్ సందేశ్ అని దిల్ రాజు "దాగుడు మూతలు" అనే టైటిల్ ని కూడా రీజిస్టర్ చేయించారు. మరీ ఈ రెండు కాంబో లో ఏది సెట్ అవుతుందో చూడాలి.
ఇక ఈ నలుగురు హీరోలు దిల్ రాజు ప్రొడక్షన్ లో మంచి హిట్స్ అందుకున్న వారే కావడంతో ఒకవేళ కథ నచ్చితే తప్పకుండా ఒప్పుకునే ఛాన్స్ ఉంది. వెయిట్ అండ్ సి.