ప్రభాస్ ఫ్రెండ్.. యువి క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన వంశీ మీద దిల్ రాజు ప్రశంసల జల్లు కురిపించాడు. తన తర్వాత చాలా ఏళ్లకు నిర్మాతగా పరిచయమైన వంశీ ఇప్పుడు తనకే సవాలు విసిరే స్థాయికి ఎదిగిపోయాడని కితాబిచ్చాడు రాజు. తాను ‘ఆర్య’ సినిమా తీసిన రోజుల నుంచి వంశీ తనకు పరిచయమని.. అప్పటికి అతను డిస్ట్రిబ్యూటర్ అని.. ఐతే కొంచెం లేటుగా ప్రొడక్షన్ మొదలుపెట్టిన అతను మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ఎదిగాడని అన్నాడు.
మంచి సినిమాలు తీస్తూనే.. ఏడు సినిమాల్లో ఐదు పెద్ద విజయాలు అందుకోవడం అంటే చిన్న విషయం కాదన్నాడు. ఒక సినిమాను సక్సెస్ చేయాలంటే ఎంత కష్టమో తనకు తెలుసని.. అందులో అనేక విషయాలు ముడిపడి ఉంటాయని.. సినిమాల్లో సక్సెస్ ఊరికే రాదని రాజు అన్నాడు. తనకు ‘యువి క్రియేషన్స్’ అంటే మరో హోమ్ బేనర్ లాంటిదని.. వంశీ నిర్మాతగా తనకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందని.. యువి క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘మహానుభావుడు’ సక్సెస్ మీట్లో రాజు వ్యాఖ్యానించాడు.
దర్శకుడు మారుతి చాలా సింపుల్ కథతో ‘మహానుభావుడు’ను తెరకెక్కించాడని.. అతను రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలన్న ఆలోచనతోనే సినిమా చేస్తాడని రాజు అన్నాడు. ‘మహానుభావుడు’లో అనేక సన్నివేశాల్ని ప్రేక్షకులు రిలేట్ చేసుకున్నారని.. మారుతి హీరో క్యారెక్టరైజేషన్ మీదే సినిమాను సరదాగా నడిపించడం గొప్ప విషయమని అన్నాడు రాజు. శర్వానంద్ ఒక సినిమా ఒప్పుకున్నాక అందులో ఇన్వాల్వ్ అయ్యే తీరు అమోఘమని రాజు కితాబిచ్చాడు.