కొన్ని కథల్ని రచయితలు ఎవరి కోసమో రాస్తారు.. కానీ అవి చివరికి వాటిని ఎవరో చేస్తుంటారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న కొత్త సినిమా ‘కృష్ణాష్టమి’ కూడా ముందు సునీల్ కోసం రాసింది కాదు. దానికి ముందు అనుకున్న హీరో అల్లు అర్జున్. ఈ సంగతి ఇప్పటికే వెల్లడైంది. ఐతే ఆ సినిమా మొదలవడానికి ముందు దిల్ రాజు క్యాంపులో ఇంకా చాలా పెద్ద కథే నడిచిందట. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి.
నిజానికి కృష్ణాష్టమి కథ లైన్ గోపీచంద్ మలినేని దిల్ రాజుకు కొన్నేళ్ల కిందట చెప్పాడట. ఆ కథను రాజు.. అల్లు అర్జున్ దగ్గరికి తీసుకెళ్లాడట. ఐతే కథ నచ్చినా.. సంథింగ్ కొత్తగా ఏదైనా చేద్దామనుకుని ఈ సినిమా చేయలేకపోయాడట. దీంతో అప్పటికి ఈ సినిమా పక్కకు వెళ్లిపోయిందట. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత.. హరీష్ శంకర్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కథతో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేద్దామని అనుకున్నాడట. మరోవైపు వాసు వర్మ.. సాయిధరమ్ తేజ్ హీరోగా ‘లవర్’ అనే సినిమా రాజు బేనర్లోనే చేయడానికి రంగం సిద్ధమైందట.
ఐతే అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేయాలని నిర్ణయించుకోవడంతో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కథను సాయిధరమ్ కు మళ్లించాడట హరీష్ శంకర్. సాయిధరమ్ ఫ్రీగా లేకపోవడంతో వాసు వర్మకు గతంలో పక్కనపెట్టేసిన ‘కృష్ణాష్టమి’ కథ వినిపించాడట రాజు. అతడికి కథ నచ్చి.. దాని మీద మరింత వర్క్ చేసి ఫుల్ స్క్రిప్టు రెడీ చేశాడట. తర్వాత వీళ్లిద్దరూ కలిసి సునీల్ కు కథ చెప్పడం.. అతడికి నచ్చడం.. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడం.. అంతా చకచకా జరిగిపోయింది. మొత్తానికి ‘కృష్ణాష్టమి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట.