ఆ కళ్యాణం ఎన్టీఆర్ చేసుకుంటున్నాడా?

Update: 2017-09-07 17:57 GMT
ఆల్రెడీ పెళ్లయిన జూనియర్ ఎన్టీఆర్ కు మళ్ళీ కళ్యాణం ఏంటి అనుకుంటున్నారా? లేదంటే మనోడేమైనా దేవుడి కళ్యాణం చేయిస్తున్నాడు అని సందేహం వచ్చిందా? రెండూ కాదండోయ్. ఇప్పుడు మనం మాట్లాడేది కేవలం ఒక కొత్త సినిమా గురించి మాత్రమే. పదండి అసలేంటో చూద్దాం.

కొన్ని సినిమాలు భలే గమ్మత్తయిన టర్నింగులు తిరుగుతంటాయ్. ఒక కథ చాలామంది హీరోలకు నచ్చక దానిని ఎవరో చేస్తారు. అది పెద్ద హిట్టయిపోతుంటుంది. కొన్ని ఫ్లాపులు కూడా అవుతాయిలే. 'ఫిదా' సినిమా స్టోరీని మహేష్‌ బాబు అండ్ రామ్ చరణ్‌ రిజక్ట్ చేయడం కారణంగా.. అది వరుణ్‌ తేజ్ ఒడిలో వచ్చి వాలింది. ఇంకేముంది 50 కోట్ల షేర్ తెచ్చేసింది. అలాగే నిర్మాత దిల్ రాజు 'శతమానం భవతి' సక్సెస్ తరువాత రైటర్-డైరక్టర్ సతీశ్‌ వేగేశ్నతో ఒక కథను వండించి చాలామంది హీరోలకు చెప్పిస్తున్నాడు. నాని.. నాగార్జున.. సాయిధరమ్ తేజ ఇలా చాలామంది హీరోలు విన్న కథ.. చేద్దామనుకున్న కథ.. ''శ్రీనివాస కళ్యాణం''. కాని ఎందుకో ఒక్క హీరో కూడా ఆ సినిమాను పట్టాలెక్కించలేదు.

లేటెస్టుగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. ఇప్పుడు ఈ కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్ళాడట దిల్ రాజు. ఎన్టీఆర్ కు కథ బాగానే నచ్చింది కాని.. అప్పుడే డేట్స్ ఇవ్వలేను అన్నాడు. అయితే త్రివిక్రమ్ సినమా పూర్తయ్యాక ఈ సినిమా చేద్దాం అంటూ దిల్ రాజు నందమూరి హీరోతో డేట్ సెట్ చేసుకున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగానే పుచ్చుకుంటున్నాడని కూడా తెలుస్తోంది.
Tags:    

Similar News