మలయాళ నటిని కిడ్నాప్ చేసి.. లైంగిక వేధింపులకు గురి చేసిన దారుణ ఉదంతం గురించి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి.. అసలు స్కెచ్ వేసిన మలయాళ అగ్రనటుల్లో ఒకరైన దిలీప్ ను ఆ మధ్య పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులకు.. షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నటి మంజూ వారియర్ దిలీప్ మొదటి భార్య కాగా.. ఆమెతో విడిపోయిన తర్వాత మరో నటి కావ్య మాధవన్ ను పెళ్లాడినట్లుగా ఇప్పటివరకూ అందరికున్న సమాచారం.
అయితే.. తాజాగా పోలీసుల విచారణలో వెల్లడించిన విషయాల్ని చూస్తే.. మంజూను పెళ్లాడటానికి ముందే మరో మహిళను దిలీప్ పెళ్లాడినట్లుగా పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం మంజూను పెళ్లాడటానికి ముందే దిలీప్ ఒక మహిళను పెళ్లాడినట్లుగా తెలుస్తోంది.
దూరపు బంధువుల అమ్మాయిని మొదట పెళ్లాడిన దిలీప్ కొద్దికాలం తర్వాత ఆ అమ్మాయితో విడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆమెకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదని చెబుతున్నారు. 1990లో మంజూను వివాహమాడే సమయంలో మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం దిలీప్ మొదటి భార్య గల్ఫ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. దిలీప్ చెప్పిన మాటలు నిజమేనా? అన్న అంశాన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని సేకరించేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఫైళ్లను చెక్ చేయిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం కావ్య.. దిలీప్ మూడో భార్యగా భావించాల్సిందే.