కాస్టింగ్ ఎంపికలో పక్కా పెర్ఫెక్షనిస్టుగా తేజకి పేరుంది. తన సినిమాలో హీరో, హీరోయిన్ లుక్ పరంగా ఎలాంటి డెఫిక్టు లేకుండా చూసుకుని సెలక్ట్ చేసుకుంటాడన్న పేరుంది. అందుకే తేజ పరిచయం చేసిన చాలామంది హీరోలు మినిమం కెరీర్ ని డ్రైవ్ చేసినవారే. ఉదయ్ కిరణ్ - నితిన్ - నవదీప్ - ప్రిన్స్ ఇలా హీరోలంతా తేజ పరిచయం చేయడం వల్లే ఆ మాత్రం మైలేజ్ అందుకున్నారనడంలో సందేహమే లేదు.
వీళ్లందరిలో ఒక్క నితిన్ తప్ప మిగతా అందరూ ఏ బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లే. ఇప్పుడు కూడా మరో హీరోని ఏ సినీ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోని ఎంపిక చేసుకున్నాడు. అతడి పేరు దిలీప్ తమనం పూడి. హోరాహోరీ హీరో. ఈ చిత్రంలో నటీనటుల కోసం కాస్టింగ్ సెలక్షన్స్ కి ఎటెండ్ అయిన దిలీప్ ని 25నిమిషాల్లో తేజ ఫైనలైజ్ చేశారు. ఇది ఊహించనిది. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన తర్వాత అమ్మానాన్న ప్రోత్సాహంతో హీరోగా ప్రయత్నించాను. ముందుగా వైజాగ్ సత్యానంద్ వద్ద నటశిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత కాస్టింగ్ ఎంపికలకు ఎటెండ్ అయ్యా. తేజగారికి నచ్చాను. అది నా అదృష్టం.. అంటున్నాడు ఈ యంగ్ స్టర్.
ఇక తేజ గురించి చెబుతూ.. ఆయన చాలా సీరియస్ అని చెబుతారు కానీ అది పనిలో ఉన్నంత సేపే. ఒకసారి షూట్ అయిపోయాక అంతా మామూలు అయిపోయి అందరితో కలిసిపోతారు.. అంటూ చెప్పుకొచ్చాడు దిలీప్. పెద్ద నటుడిగా ఎదగాలంటే బెగ్గర్ ని, బిజినెస్ మేన్ ని కూడా పరిశీలించాల్సిందే. నేను రెగ్యులర్ గా ఇలాంటి రియల్ క్యారెక్టర్ లను పరిశీలిస్తుంటా. అది పెద్ద సాయం అయ్యిందని అన్నాడు. ఆల్ ది బెస్ట్ దిలీప్.