మళ్ళీ తిప్పి కొట్టిన తీర్పు

Update: 2017-08-30 04:27 GMT
సినీ ఫీల్డ్ లో క్రమశిక్షణతో ఉంటే ఎన్నో ఆఫర్లు వాటంతట అవే వస్తుంటాయి. జయపజయాల కన్నా ముందు ఆర్టిస్ట్ కి ఉండాల్సింది మంచి గుణం. కానీ ఓ హిరో తను వేసిన తప్పటడుగులు అతని జీవితాన్ని మార్చేశాయి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్టార్ డమ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఎన్నో సినిమాల్లో హీరోగా హీరోయిన్ గా నటించి చివరకు నిజ జీవితంలోనే విలన్ గా మరి విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు.

ఇప్పటికే అతను ఎవరో అర్ధమయ్యే ఉంటుంది. దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ మలయాళీ నటి లైంగిక కేసులో మరో సంచలన వార్త హాట్ టాపిక్ గా మారింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హీరో దిలీప్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. గత కొంత కాలంగా జైలులో జీవితాన్ని గడుపుతున్న  దీలిప్ కు కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి.. అతను బయటకి వెళితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందనే ఆరోపణలు రావడంతో దీలిప్ కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. జులై 10 అరెస్ట్ అయిన దిలీప్ తమ స్టార్ హోదాకి దూరంగా బతుకుతున్నాడు. దాదాపు 50 రోజులుగా అలువా సబ్‌ జైలులోనే ఉన్నారు.

అయితే ఇప్పటికే ఓ సారి బెయిల్ ను తిరస్కరించిన కోర్టు మరోసారి రిక్వెస్టు పెట్టుకోవడంతో ఈ సారి కూడా వదిలేది లేదని గట్టిగా చెప్పింది. మలయాళం లో ఈ వార్త ఇప్పటికి సంచాలనాన్ని రేపుతోంది. ఈ హీరోపై కొందరు ప్రముఖులు సానుభూతిని కూడా చూపిస్తూ.. ఆయనకు అండగా ఉండాలని కోరుతున్నారు.
Tags:    

Similar News