మలయాళ హీరోకి అనుమతి లభించింది

Update: 2017-11-18 07:21 GMT
మలయాళ హీరోయిన్ కిడ్నప్ కేసులో దాదాపు మూడు నెలల వరకు జైల్లో ఉండి వచ్చిన హీరో దిలీప్ ప్రస్తుతం తన రెగ్యులర్ లైఫ్ ని హ్యాపీగా కొనసాగిస్తున్నాడు. మలయాళంలో ఎంతో స్టార్డమ్ ని సంపాదించుకున్న ఈ హీరో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అరెస్ట్ అయిన రోజే అతని కెరీర్ క్లోజ్ అని కూడా అన్నారు.

సాక్ష్యాలు కూడా బలంగా ఉండడంతో జీవిత కలం జైలు శిక్ష పడుతుంది అని రూమర్స్ వచ్చాయి. కానీ ఈ నటుడు ఏ మాత్రం తొందరపడకుండా జైల్లోనే ఉంటూ బెయిల్ కోసం చాలానే కష్టపడ్డాడు. మూడు సార్లు కోర్టును బ్రతిమాలితే నాలుగోసారి కనికరం చూపి కండిషన్స్ తో కూడిన బెయిల్ ను ఇచ్చింది ధర్మాసనం. అయితే దిలీప్ కేసు క్లోజ్ అయ్యేంత వరకు బయట దేశాలకు వెళ్లకూడదు. కానీ ఇప్పుడు వెళ్లడానికి రెడీ అయ్యాడు. రీసెంట్ గా కోర్టు అనుమితి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

దుబాయ్ లో తన రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ కానున్న సందర్బంగా తాను వెళ్లాలని కోరడంతో అనుమతి లభించినట్లు సమాచారం. అయితే రీసెంట్ గా దిలీప్ ను పోలీసులు సీక్రెట్ గా విచారించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి రూమర్స్ అని తెలిసింది. నెక్స్ట్ వీక్ కి విచారణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.   
Tags:    

Similar News