నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్ లు ఆపాల‌న్న ఆలోచ‌న లేదు: దిల్ రాజు

Update: 2022-08-04 10:43 GMT
ఆగ‌స్టు 1 నుంచి సినిమాల షూటింగ్ లు నిర‌వ‌ధింగా ఆపేయాల‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌, తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. సినిమా షూటింగ్ లు నిలిపివేసి గురువారానికి నాలుగో రోజుకు చేరింది. అయితే దిల్ రాజు త‌ను మాత్రం విజ‌య్ తో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ని య‌ధేశ్చ‌గా జ‌రుపుకుంటున్నార‌ని వస్తున్న వార్త‌ల‌పై తాజాగా గురువారం స్పందించారు. గురువారం తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ క‌మిటీ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది.

ఈ స‌మావేశంలో  వీపీయ‌స్ (వ‌ర్చువ‌ల్ ప్రింట్ స‌ర్వ‌ర్‌) ఛార్జెస్ ఎంతుండాలి? , సినిమా ఎన్ని వారాల త‌రువాత ఓటీటీ కి ఇస్తే మంచిది?  వంటి ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన దిల్ రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు వ్య‌క్తి గ‌త అజెండాలు ఏమీ లేవ‌ని, కేవ‌లం సినిమాల కోస‌మే ప‌ని చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. నిర్మాత‌లం అంద‌రం క‌లిసి షూటింగ్స్ ఆపేశాం. మేం ప్ర‌స్తుతం నాలుగు అంశాల‌పై చ‌ర్చిస్తున్నాం.

సినిమాలు ఎన్ని వారాల త‌రువాత ఓటీటీలోకి వెళితే మంచిది అనే విష‌యంలో ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ క‌మిటీ ఓటీటీకి సంబంధించిన దానిపై ప‌ని చేస్తుంది. థియేట‌ర్స్ లో వీపీఎఫ్ చార్జీలు, ప‌ర్సెంటేజీలు ఎలా వుండాలి అనేదానిపై క‌మిటీ వేశాం. ఆ క‌మిటీ ఎగ్జిబిట‌ర్ల‌తో మాట్లాడుతుంది.

ఆ త‌రువాత ఫెడ‌రేష‌న్ వేజెస్‌, వ‌ర్కింగ్ కండీష‌న్స్ పై కూడా క‌మిటీ వేశాం. అలాగే నిర్మాత‌ల‌కు ప్రొడ‌క్ష‌న్ వేస్టేజ్ లో త‌గ్గింపు, వ‌ర్కింగ్ కండీష‌న్స్, షూటింగ్ నంబ‌రాఫ్ అవ‌ర్స్ జ‌ర‌గాలంటే ఏం చేయాల‌న్న‌దానిపై కూడా క‌మిటీ వేశాం. ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఈ నాటు అంశాల మీద నాలుగు క‌మిటీలు వేశాం.

ప్ర‌స్తుతం అవి వాటి పనిలో వున్నాయి. కానీ కొంద‌రు సోష‌ల్ మీడియాలో ఏవేవో రాస్తున్నారు. మా అంద‌రికి నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్ లు ఆపాల‌న్న ఆలోచ‌న లేదు. నిర్మాత‌కు ఏదీ భారం కాకూడ‌దు. గ‌త మూడు రోజుల నుంచి మూడు నాలుగు మీటింగ్స్ జ‌రిగాయి. నాలుగు క‌మిటీలు చాలా హోమ్ వ‌ర్క్ చేస్తున్నాయి. తెలుగు సినిమా ఎలా వుండాల‌నేది వ‌ర్క్ చేస్తున్నాం. త్వ‌ర‌లో ఆ రిజ‌ల్ట్ వ‌స్తుంది` అని వెల్ల‌డించారు దిల్ రాజు.  

అనంత‌రం సి. క‌ల్యాణ్ మాట్లాడుతూ ` తెలుగు సినిమా ఫిలిం ఛాంబ‌ర్, తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ నిర్మాత‌ల మండ‌లి త‌రుపున మేమంతా షూటింగ్ లు ఆపుకుని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తున్నాం. మా నిర్మాలంద‌రికి విన్న‌పం. ఎవ‌రు ఏం చెప్పినా విన‌కండి. వారం ప‌దిరోజుల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. గిల్డ్, నిర్మాత‌ల మండ‌లి, ఫిలింఛాంబ‌ర్ అంతా ఒక్క‌టే.. వ‌ర్క్ డివైడ్ చేసుకుని ప‌ని చేస్తున్నాం` అన్నారు.
Tags:    

Similar News