రామ్ చరణ్-శంకర్-దిల్ రాజు కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. శంకర్-చరణ్ ఒకే. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ దిల్ రాజు-శంకర్ ద్వయం అంటేనే ఎన్నో సందేశాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా బడ్జెట్ .. కాస్ట్ కంట్రోల్ ఫ్యాక్టర్స్ గురించి రకరకాల చర్చ సాగింది. శంకర్ సినిమా అంటే నిర్మాణంలో ఎక్కడా రాజీ పడరు. రాజీ పడితే సినిమా మధ్యలోనే వదిలేస్తారు. భారీ సెట్లు.. ఖరీదైన విదేశీ లోకేషన్లు.. భారీగా రెమ్యునరేషన్ తీసుకునే నటులు కావాలి. ఇలా శంకర్ సినిమా అంటే నిర్మాతకి సినిమా రిలీజ్ అయ్యేలోపు తడిపి మోపుడు అవుతుంది అన్నది వాస్తవం. శంకర్ ని తట్టుకోవడం పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థల వల్లనే కాలేదు.
అలాంటింది రాజు గారు శంకర్ ని తట్టుకుని నిలబడగలరా? అసలు శంకర్ తో సినిమా పూర్తి చేయగలరా? అసలు శంకర్ మాట రాజు గారు వింటారా? ఇలా ఎన్నో సందేహాలే కలిగాయి. ఈ సందేహాలకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. దిల్ రాజు అనవసర ఖర్చులకు అస్సలు ఒప్పుకోరు. పర్పెక్ట్ కాస్ట్ కటింగ్ ప్రొడ్యూసర్ గా రాజుగారికి మంచి పేరు ఉంది. సినిమాకు అవసరమైతే ఎంతైనా పెడతారు. కానీ అనవసరం అని భావిస్తే రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయడానికి ఒప్పుకోరు. ఆ విషయంలో దర్శకులు రాజుగారు చెప్పినట్లు చేయాల్సిందే. నిర్మాణ పరంగా రూపాయి తగ్గించడానికే చూడాలి తప్ప పెంచడానికి చూడొద్దని తన దర్శకుల మైండ్ ని ముందే ఫిక్స్ చేసేస్తారు.
అందుకు శంకర్ పూర్తిగా భిన్నం. సెట్స్ లో ఆయన చెప్పినట్లు చేయాలి తప్ప నిర్మాత మాట్లాడటానికి ఏమీ ఉండదు. మరి అలాంటి రెండు నాన్ సింక్ పాత్రల మధ్య ఆర్.సీ 15 ముగించేది ఎలా..? అంటూ సందేహించిన వారికి తొలి షెడ్యూల్ ప్యాకప్ అయ్యాక నమ్మకం వచ్చిందని చెప్పాలి. ఇటీవలే మహారాష్ట్రలో ఆ ముగ్గురు మొదటి షెడ్యూల్ ని పూర్తిచేసిన సంగతి తెలిసిందే. టీమ్ అంతా కలిసి దిగిన ఫోటోని ఇన్ స్టా వేదికగా పంచుకుని రెడీ ఫర్ సెకెండ్ షెడ్యూల్ అనేసారు. ఈ షెడ్యూల్ అన్ని సందేహాల్ని..అందరి సందేహాల్ని తీర్చేసింది. రాజుగారు శంకర్ ట్రీట్ మెంట్ కి ఫిదా అయిపోయారని... దేశం గర్వించదగ్గ దర్శకుడి దారిలోకి పూర్తిగా రాజుగారు వెళ్లిపోయారని అంటున్నారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదని...శంకర్ అడగడమే ఆలస్యం క్షణాల్లో అన్ని ఏర్పాట్లు జరిగిపోయేవని చెబుతున్నారు. మొత్తానికి శంకర్ తో సినిమా తీయాలన్న తన కలను రాజుగారు ఈ రకంగా పుల్ ఫిల్ చేసుకుంటున్నారు.