సక్సెస్ క్లిక్‌ : దిల్‌ రాజు జాక్ పాట్.. అందుకే ఈ పార్టీ

Update: 2022-08-08 05:16 GMT
నందమూరి కళ్యాణ్ రామ్‌ నటించి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార సినిమాను దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేశాడు. సినిమా పూర్తి అయిన సమయంలో దిల్‌ రాజు మరియు శిరీష్ లకు చూపించిన కళ్యాణ్ రామ్‌ వారిని మెప్పించాడు. అయితే కళ్యాణ్ రామ్‌ మార్కెట్‌ దృష్ట్యా దిల్ రాజు కాస్త కమర్షియల్‌ గా ఆలోచించి చాలా తక్కువ మొత్తంను కోట్‌ చేశాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

బింబిసార సినిమా ను దాదాపుగా రూ.40 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిస్తే థియేట్రికల్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 20 కోట్లు లోపు మాత్రమే జరిగింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

దిల్ రాజు సినిమా ను తక్కువ మొత్తానికి కొనుగోలు చేయడంతో ఇప్పుడు భారీగా లాభాలు వస్తున్నాయి అంటూ సమాచారం అందుతోంది. దిల్ రాజు సినిమా సక్సెస్ అవ్వడంతో యూనిట్‌ సభ్యులకు పార్టీ ఇచ్చాడు.

ఈ సక్సెస్ పార్టీ లో బింబిసారుడు నందమూరి కళ్యాణ్ రామ్‌ తో పాటు దర్శకుడు వశిష్ఠ్‌.. సంగీత దర్శకుడు కీరవాణి ఇంకా ఇతర టెక్నీషియన్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు.

ఇటీవల థాంక్యూ సినిమా తో చాలా నష్టపోయిన దిల్ రాజుకు అందులో నష్టపోయిన మొత్తంకు డబుల్‌ లాభాలాను తెచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై నమ్మకంతో భారీగా ఖర్చు పెట్టారు. ఆ నమ్మకం వమ్ము కాలేదు. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని కళ్యాణ్ రామ్‌ తో పాటు ఇప్పుడు దిల్ రాజుకు కూడా లాభాలను తెచ్చి పెట్టింది. సినిమా లోని ప్రతి సన్నివేశం లో కూడా కళ్యాణ్ రామ్ నటన బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News