రవితేజకి వీరాభిమానినంటూ డింపుల్ వయ్యారాలు!

Update: 2022-02-10 03:37 GMT
తెలుగులో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'డింపుల్ హయతి'. టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే హాట్ బాంబ్ అనిపించుకోవడానికి తహతహలాడుతోంది. 'గద్దలకొండ గణేశ్' సినిమాలో 'జర్రా జర్రా' అనే పాటలో మెరిసిన ఈ బ్యూటీ, రెండవ సినిమానే రవితేజతో చేయడం విశేషం. రవితేజతో సినిమా అంటే మూమూలు విషయం కాదు. ఆయన ఎనర్జీని అందుకోవాలి. ఆయన మాస్ ఫ్యాన్స్ ను మెప్పించాలి. ఆ విషయంలో డింపుల్ ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదనే అనిపిస్తోంది. 'ఖిలాడి' సినిమా పోస్టర్స్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమవుతోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డింపుల్ మాట్లాడుతూ .. "చాలాకాలం తరువాత మీ ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. 'జర్రా జర్రా' సాంగ్ లో మీకు కొంతసేపు కనిపించాను. ఇప్పుడు పూర్తిస్థాయిలో 'ఖిలాడి' సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. అది కూడా నా ఫేవరేట్ రవితేజ సార్ తో.

చాలా కాలంగా ఇలాంటి ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. అలాంటి ఛాన్స్ రవితేజ గారి సినిమాతో రావడం గొప్ప విషయం. మీ అందరిలాగానే నేను కూడా రవితేజ గారికి వీరాభిమానిని. ఆయనతో కలిసి పనిచేయడం నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించింది.

రవితేజగారితో కలిసి పనిచేయడం వలన నేను చాలా విషయాలను తెలుసుకున్నాను. అలా అని చెప్పేసి ఆయన అడ్వైజ్ చేస్తూ ఉంటారని కాదు. ఆయనతో మాట్లాడుతూ ఉండటం వలన అనేక విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. దర్శకుడు రమేశ్ వర్మ గారు నన్ను చూసి ఈ పాత్రకి సెట్ అవుతానని నన్ను సెలెక్ట్ చేశారు. అందుకు ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయన ఈ సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు కూడా. నిర్మాత కోనేరు సత్యనారాయణగారు గురించి చెప్పాలంటే ఆయన చాలా హంబుల్.

ఈ సినిమాలో నాకు చాలా ఇంపార్టెంట్ రోల్ దక్కింది. ఈ రోజుల్లో హీరోయిన్స్ కి ఇంత ఇంపార్టెంట్ రోల్స్ పడటం లేదు. అలాంటి ఒక పాత్రను నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ కూడా సూపర్బ్ గా వచ్చాయి.

ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఒక మంచి ప్యాకేజ్ తో మేమంతా మీ ముందుకు రాబోతున్నాము ఫిబ్రవరి 11వ తేదీన. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News