రైటర్ లుగా సక్సెస్ అయిన వారంతా స్టార్ డైరెక్టర్ లుగా మారిపోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ - కొరటాల శివ - సుకుమార్ ఇలా రైటర్ లుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న తరువాతే దర్శకులుగా సక్సెస్ అయ్యారు.
వీరి తరహాలోనే అనిల్ రావిపూడి రైటర్‌గా ముందు గుర్తింపుని దక్కించుకుని ఆ తరువాతే డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన `పటాస్` మూవీతో అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే.
ఈ మూవీ కల్యాణ్ రామ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ వచ్చి ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లవుతోంది. ఇంత వరకు మరోసారి కల్యాణ్ రామ్ - అనిల్ రావిపూడి కలిసి సినిమా చేయలేదు.
`కల్యాణ్ రామ్ `పటాస్`తో అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. మహేష్ బాబు - విక్టరీ వెంకటేష్.. నందమూరి బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. అయితే మళ్లీ కల్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి సినిమా చేసే అవకాశాలు కనిపించడం లేదని ప్రచారం జరిగింది.
ఈ ప్రచారంపై తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ కొట్టి పారేశారు. తనకు తొలి అవకాశం ఇచ్చిన హీరో కల్యాణ్ రామ్ తో ఖచ్చితంగా సినిమా చేస్తానని, పటాస్ 2` ని ఇద్దరం కలి చేస్తామని ప్రకటించాడు.
`పటాస్` హిట్ తరువాత ఇద్దరం కలిసి మరో సినిమా చేయాలని అనుకున్నాం. ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఓ కథ కూడా వినిపించాను. తను కూడా ఓకే అన్నారు. కానీ ఎందుకో కుదరలేదు. మూడవ సినిమా అయినా ఇద్దరం కలిసి చేయాలనుకున్నాం అదృష్టం కలిసినాలేదు. అయితే ఎప్పటికైనా `పటాస్ 2` చేస్తాం. టైమ్ చూసుకుని ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాం` అని స్పష్టం చేశారు అనిల్ రావిపూడి.
అంతే కాకుండా ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ కు తనకు మధ్య దూరం పెరిగిందని వస్తున్న వార్తలపై మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు , కల్యాణ్ రామ్ కు మధ్య మంచి అనుబంధం వుందని, మా మధ్య గ్యాప్ రాదని స్పష్టం చేశాడు అనిల్ రావుపూడి.
`పటాస్` రిలీజ్ టైమ్ లో ఇద్దరం కలిసి సక్సెస్ టూర్ వెళ్లామని, ఆ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఆయన తన మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఫోన్ చేసి ప్రత్యేకంగా మాట్లాడానని, మా మధ్య వున్న అనుబంధం ఎప్పటికీ పోదని క్లారిటీ ఇచ్చారు.
అనిల్ రావిపూడి రెండు చిత్రాలతో బిజీగా వుంటే కల్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార, డెవిల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలు చర్చల దశలో వున్నాయి. అయితే అనిల్ రావిపూడి - కల్యాణ్ రామ్ ల `పటాస్ -2` ఎప్పటికి పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే.