టాలీవుడ్లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే దిశగా బాబీ వెళుతున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చేయడంలో తనకి మంచి అనుభవం ఉందని ఇప్పటికే నిరూపించాడు. రవితేజ 'డాన్ శీను' .. 'బలుపు' సినిమాలకు రైటర్ గా పనిచేసిన బాబీ, ఆ తరువాత ఆయనతో 'పవర్' సినిమాను చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రవితేజ తాజా చిత్రమైన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాబి స్పెషల్ గెస్టుగా వచ్చాడు.
ఈ స్టేజ్ పై బాబి మాట్లాడుతూ .. మాస్ మహారాజ్ ను పట్టుకుంటే లైఫ్ సెటిలైపోతుంది. మాలాంటి వాళ్ల రేంజ్ .. రేంజ్ రోవర్ స్థాయిలో సెట్ అయిపోతుంది. ఆయనతో సినిమా చేసిన వాళ్లలో నేను కూడా ఒకడిని. 'బలుపు' సినిమాకి ముందువరకూ నా లైఫ్ వేరుగా ఉండేది. ఆ తరువాత ఆయనకి నేను కథ చెప్పడం .. నాకు ఆయన డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగిపోయింది. అప్పటి నుంచి నా లైఫ్ జర్నీ స్పీడ్ అందుకుంది.
రవితేజగారు నాకు 'పవర్' సినిమాకి ఛాన్స్ ఇవ్వడం వల్లనే పవన్ కల్యాణ్ గారితో 'సర్దార్ గబ్బర్ సింగ్' చేసే ఛాన్స్ వచ్చింది. అప్పుడు నేను ఆ విషయాన్ని నా ఫ్యామిలీతో కంటే ముందుగా నేను రవితేజ గారికి చెప్పాను. అప్పుడు ఆయన నా భుజం తట్టారు. అయితే 'సర్దార్ గబ్బర్ సింగ్' కి మేము ఆశించిన రిజల్ట్ రాలేదు. అయినా నాతో సినిమా చేయడానికి రవితేజ ఉత్సాహాన్ని చూపించారు .. అదే ఆయన ప్రత్యేకత. సెట్ చేయడమే కాదు రీసెట్ చేయడం కూడా ఆయనకి తెలుసు.
రవితేజతో నేను ఒక ప్రాజెక్టును సెట్ చేసుకుంటూ ఉండగా, 'జై లవ కుశ' చేసే ఛాన్స్ వచ్చింది. నేను ఆ సినిమా చేయాలంటే రవితేజ పర్మిషన్ కావాలి. ఇబ్బంది పడుతూనే ఆయనకి విషయం చెప్పాను. వెంటనే ఆయన ఒప్పేసుకోవడమే కాకుండా .. నీ కెరియర్ మరింత స్పీడ్ అందుకుంటుంది అంటూ ప్రోత్సహించారు. అలా ఒప్పుకోవడం ఆయనకే చెల్లింది. అంతేకాదు చిరంజీవి గారితో నేను చేస్తున్న సినిమాలో రవితేజ కూడా చేస్తున్నారు. నేను చెప్పగానే ఆయన ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సినిమాలో అంతా విజిల్స్ వేసేలా ఆయన రోల్ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.