డైరెక్టర్ గీతాకృష్ణ పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే సినిమా 'కోకిల'. కథాకథనాలపరంగా .. పాటల పరంగా అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్. తెలుగులో ఆయన తెరకెక్కించిన సినిమాలు అరడజను ఉంటాయేమో. ఆయన మొదటి సినిమా 'సంకీర్తన'. ఈ సినిమాలో నాగార్జున - రమ్యకృష్ణ జంటగా నటించారు. గీతాకృష్ణ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రమ్యకృష్ణను గురించి ప్రస్తావించారు.
'సంకీర్తన' సినిమా సమయంలో నేను కొత్త హీరోయిన్ కోసం వెదుకుతున్నాను. ఆ సినిమాలో నాగార్జునగారు హీరో. కొత్త హీరోయిన్ ను తీసుకోనున్నట్టుగా నేను అక్కినేని నాగేశ్వరరావుగారికి కూడా చెప్పడం జరిగిపోయింది. ఆ సమయంలో ఒక స్టేజ్ పై డాన్స్ చేస్తున్న రమ్యకృష్ణగారిని చూసి నేను ఆమెతో మాట్లాడటం జరిగింది. అప్పటికి ఆమె తమిళంలో చేస్తోంది. తెలుగులో చేస్తే నా సినిమాతోనే పరిచయం అయినట్టుగా ఉంటుందనేసి తీసుకున్నాను. 'సంకీర్తన' సినిమా చేసిన మూడేళ్లకి నాకు తెలిసింది. ఈ సినిమా కంటే ముందే ఆమె తెలుగులో మరో సినిమా చేసిందని.
ఆ విషయం తెలిసినప్పుడు మాత్రం నాకు చాలా కోపం వచ్చేసింది. 'సంకీర్తన' సినిమాలో కొత్త అమ్మాయి కావాలని నేను ఎంతగానో తిరిగాను. నాగార్జున గారితో సహా అంతా ఆమెను కొత్త అమ్మాయే అనుకున్నాము.
అంతకుముందే ఆమె ఇక్కడ మరో సినిమాలో చేసిందనే విషయం యూనిట్ లో ఎవరికీ కూడా తెలియదు. 'సంకీర్తన'లో ఆమెకి నిజంగా చాలా పెద్ద కేరక్టర్ పడింది .. అయినా తాను చాలా బాగా చేసింది. ఆమె ఇంత గొప్ప ఆర్టిస్ట్ అవుతుందని అప్పట్లో నేను అనుకోలేదు. 'నరసింహా' సినిమాలో రజనీతో పోటీపడి చేసిన తరువాత ఆమె క్రేజ్ పెరిగింది.
తెలుగులో హీరోయిన్ గా ముందుగా ఆమె నా సినిమాలోనే చేసినప్పటికీ, రాఘవేంద్రరావుగారి సినిమాలు చేయడం వల్లనే తాను పైకి వచ్చినట్టుగా ఆమె చెబుతుంటారు. సరే ఎవరైతే ఏవుంది .. పైకి రావడం కాలవసింది.
కెరియర్ ఆరంభంలో ఆమెను ఐరన్ లెగ్ అన్నారు. కానీ ఆ తరువాత హిట్లు అందుకుంటూ వెళ్లింది. 'సంకీర్తన' కంటే ముందుగానే ఆమె ఇక్కడ మరో సినిమాలో చేయడం వల్లనే, ఆమెను పరిచయం చేసింది నేను అని ఎక్కడా చెప్పలేదు. ఆ సినిమా సమయంలో కనుక నాకు ఈ విషయం తెలిస్తే తప్పకుండా తీసేసేవాడిని" అంటూ చెప్పుకొచ్చారు.