క్రాక్ చిత్రం ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనితో తుపాకీ డాట్ కామ్ ఎక్స్ క్లూజీవ్ చిట్ చాట్

Update: 2021-01-19 08:01 GMT
* కంగ్రాట్స్ గోపీ గారు మొద‌టి స‌క్సెస్ మీకే దక్కింది..

- (కొంత సేపు ఆశ్చ‌ర్యం - ఆ త‌రువాత పెద్ద న‌వ్వుతో స‌మాధానం మొద‌లైంది) అవునండి మీరు అన్న‌ట్లుగా తొలి సక్సెస్ అందుకున్నాను - నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. మొత్తం ప్రపంచ సినీ పరిశ్ర‌మ చ‌రిత్ర‌ని ఇప్పుడు బిఫోర్ క‌రోనా ఆఫ్ట‌ర్ కరోనా అని వేరు చేసి చెప్ప‌వ‌చ్చు. ఇక మ‌న తెలుగులో ఆఫ్ట‌ర్ క‌రోనా క్రైసిస్ థియేట్రిక‌ల్ రిలీజైన‌ మా క్రాక్ సినిమా విజ‌యవంతం అవ్వ‌డం నిజంగా నాకు ఫుల్ పాజిటివ్ ఎన‌ర్జీ అండ్ హోప్ ఇచ్చింది. దీనికి నేను ముఖ్యంగా తెలుగు సినీ అభిమానుల‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను - వారి ఆద‌రణ కార‌ణంగానే క్రాక్ ఇప్పుడు సంక్రాంతి విన్న‌ర్ గా నిలిచింది.

* మొద‌టిసారిగా ఓ పోలీస్ క‌థ‌ని తెర‌కెక్కించారు - ఈ జాన‌ర్ ని ఎంచుకోవ‌డానికి ఎందుకింత లేట్ చేశారు..?

- డాన్ శీను ద‌గ్గ‌ర ద‌ర్శ‌కుడిగా నా కెరీర్ ప్రారంభంమైంది అయితే తెలుగులో తిరుగులేని జాన‌ర్ ఏదైనా ఉందంటే అది పోలీస్ క‌థే. అయితే ఎప్ప‌టినుంచో నేను కూడా ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ క‌థ‌ని తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నాను - దేనికైనా అన్ని కుద‌రాలిగా - క్రాక్ రూపంలో అన్ని క‌లిసొచ్చాయి - అదే రీతిన ఆడియెన్స్ కూడా సినిమాను ఆద‌రించారు

* స‌క్సెస్ అనేది ఇండ‌స్ట్రీలో ట్రేడ్ మార్క్ కాదంటారా..?

- స‌క్సెస్ ఉంటేనే ఇండ‌స్ట్రీలో ఉంటాం - అయితే అలా అని ఫేయిల్యూర్ ని ప‌క్క‌న‌పెట్టేయ‌లేము - వాస్త‌వానికి ఫెయిల్ అయితేనే మ‌న చుట్టూ ఉన్నావారికి మ‌న‌కు మధ్య ఉన్న ఫిల్ట‌ర్లు తొలిగిపోతాయి. నా కెరీర్ లో కూడా హిట్లు చూశాను ఫ్లాపులు చూశాను కానీ హిట్ ఇచ్చిన కిక్ కంటే ఫ్లాపు వ‌చ్చిన‌ప్పుడు ఎదుదైన అనుభ‌వాలే నాలో మ‌రింత క‌సిని పెంచాయి - అందుకే స‌క్సెస్ కంటే ఫెయిల్యూర్ కే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల‌న్న‌ది నా ప‌ర్స‌న‌ల్ ఫీలింగ్

* మొద‌టిసారిగా మీ అబ్బాయిని డైరెక్ట్ చేయ‌డం ఎలా అనిపిస్తోంది..?

- మా వాడు చాలా హైప‌ర్ - సెట్ లో ఎలా చేస్తాడో పెర్ఫార్మెన్స్ అనుకున్నా కానీ బాగా ఈజ్ తో యాక్ట్ చేశాడు.

* ర‌వితేజగారిని ప్రొప‌ర్ గా వాడుకున్న ప్ర‌తి డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యాడు - మీరు ఈ విష‌యాన్ని మూడు సార్లు రుజువు చేశారు - ఆయ‌న‌తో మ‌రో సినిమా చేసే అవ‌కాశం ఉందా..?

- వెంకీ ద‌గ్గ‌ర నుంచి ర‌వితేజ గారు నాకు ప‌రిచయం - నా మీద ఆయ‌న ఉంచిన న‌మ్మ‌కం నేను ఎప్పుడూ వొమ్ము చేయ‌లేదు. డాన్ శీను - బ‌లుపు - క్రాక్ ఇలా ప్ర‌తి సినిమాకు ఆయ‌న నా మీద ఉంచిన న‌మ్మ‌కాన్ని పెంచుకుంటూ పోతున్నాను. అయితే క్రాక్ విషయానికొస్తే ఆయ‌న్ని చాలా ప‌వ‌ర్ ఫుల్ గా చూపించాల‌నుకున్నా అందుకే ఈ సినిమాలో విల‌న్ కి కూడా చాలా ఎలివేష‌న్ ఇచ్చాను - దీంతో రవితేజ గారి క్యారెక్ట‌ర్ కూడా చాలా ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించింది. ప్ర‌స్తుతం క్రాక్ స‌క్సెస్ ని అటు ర‌వితేజ‌ గారు ఇటు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నామ్ - మ‌ళ్లీ ఆయ‌న అవ‌కాశం ఇస్తే నేను సినిమా చేయ‌డానికి రెడీ

* శృతి హాస‌న్ క్యారెక్ట‌ర్ కూడా చాలా ప‌వ‌ర్ ఫుల్ డిజైనా చేశారు - ట్విస్ట్ కూడా ఆడియెన్స్ బాగా క‌నెక్ట్ అయింది

- నిజంగా సెకండాఫ్ లో సినిమాను నిల‌బెట్టిన సీన్ ఏదైనా ఉందంటే అది శృతి హాస‌న్ యాక్ష‌న్ స‌న్నివేశ‌మ‌నే చెప్పాలి. మ‌నం చాలా సినిమాల్లో ఇది వ‌ర‌కే చూశాము. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫిస‌ర్ ఫ్యామిలీని విల‌న్ ఎటాక్ చేయ‌డం - దాంతో హీరో కాస్త విల‌న్ పై రివెంజ్ తీసుకోవ‌డం - నేను ఈ క్రాక్ క‌థ రాసుకున్న‌ప్పుడే దీన్ని మారిస్తే బెట‌ర్ అనుకొని హీరోయిన్ తో ఫైట్ సీన్ పెట్టాను - అది కాస్త ఇప్పుడు ఆడియెన్స్ కి బాగా క‌నెక్ట్ అయింది

* మొద‌టి నుంచి మీ సినిమాకు అడ్డంకులే - చివ‌ర‌కి రిలీజ్ విష‌యంలో కూడా ఆ ఒత్త‌డిని మీరు ఎలా త‌ట్టుకున్నారు

- నిండా మునిగాక చ‌లివేయ‌ద‌న్న‌ట్లు నాకు ముందు నుంచి ఈ చిత్రాన్ని థియేట‌ర్ లోనే విడుద‌ల చేయాల‌నే మాట మీదనే ఉన్నాను. దీనికి నిర్మాత ఠాగూర్ మ‌ధు గారు ఇచ్చిన స‌పోర్ట్ చాలా ఉంది. ఆయ‌న కూడా థియేట‌ర్ రిలీజ్ కే మొగ్గు చూపారు - తీరా రిలీజ్ రోజున సినిమా మూడు షోలు ఆల‌స్యంగా విడుద‌లైంది. అయిన‌ప్ప‌టికీ ఆడియెన్స్ - ర‌వితేజ ఫ్యాన్స్ చాలా ఓపిక‌గా వెయిట్ చేసి మ‌మ‌ల్ని ప్రొత్స‌హించారు. అలానే ఫిల్మ్ మీడియా వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇక ఇంత ఒత్తిడి కూడా సినిమా హిట్ టాక్ రాగానే మాయం అయిపోయింది

* థాంక్యూ గోపీ గారు - మీ క్రాక్ మ‌రిన్ని బాక్సాఫీస్ రికార్డులు క్రాక్ చేయాల‌ని మా తుపాకీ టీమ్ మ‌నఃస్పూర్తిగా కోరుకుంటుంది - ఆల్ ది బెస్ట్

- తుపాకీ టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్ థ్యాంక్యూ



Tags:    

Similar News