కార్తి హీరోగా తెరకెక్కిన `ధీరన్ అధికారం` తమిళంలో సంచలన విజయాన్ని సాధించింది. అదే మూవీని తెలుగులో `ఖాకీ` పేరుతో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా అదే స్థాయి ఫలితాన్ని రాబట్టింది. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న హెచ్ వినోద్ ఆ తరువాత నుంచి స్టార్ హీరో తల అజీత్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. `పింక్` ఆధారంగా తెరకెక్కిన `నేర్కొండ పార్వై`తో వీరి సక్సెస్ ల పరంపర మొదలైంది.
ఆ తరువాత అజిత్ హీరోగా బోనీకపూర్ నిర్మాణంలో హెచ్. వినోద్ రూపొందించిన `వలిమై` మాత్రం ఆశించిన విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి అజిత్ కాంబినేషన్ లో హెచ్. వినోద్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `తునివు`. ఈ మూవీని కూడా బోనీకపూర్ అత్యంత భారీ బడ్జెట్ తో జీ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నాడు. తమిళ యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ తమిళ నాడు అంతటా రిలీజ్ చేస్తున్నాడు.
పొంగల్ స్పెషల్ గా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై తమిళనాట భారీ అంచనాలే వున్నాయి. అజిల్ మేకోవర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. జనవరి 11న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీని ఓవర్సీస్ లో లైకా ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ బిజినెస్ రికార్డు స్థాయిలో పూర్తి చేసుకుంది. రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో దర్శకుడు హెచ్ వినోద్ ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ సినిమా వసూళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక సినిమా లాంగ్ రన్ కోసం మేకర్స్ ఎలా వసూళ్లని తారు మారు చేసి చూస్తారో వెల్లడించాడు. సోషల్ మీడియాలో సినిమా వసూళ్లని మ్యానిపులేట్ చేస్తూ చూపిస్తున్నారు. అది వారి మనుగడ కోసం చేస్తున్న పని అని హెచ్ వినోద్ తేల్చేశాడు. ఇక ఒక సినిమాని పండగ సీజన్ లో రిలీజ్ చేస్తే మామూలు సమయంలో వచ్చే వసూళ్లకు మించి వస్తాయని తెలిపాడు. `వలిమై` వసూళ్లపై వచ్చిన టాక్ పై స్పందిస్తూ `వలిమై`పై మిశ్రమ స్పందన, టాక్ వచ్చినప్పటికీ సినిమా భారీ వసూళ్లని రాబట్టి నెం.1 అనిపించుకుంది. `తునివు`పై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అవి వాస్తవానికి చాలా దూరంగా వున్నాయి. తుసీవు మల్టీజానర్ మూవీ. ఒకే జానర్ కు చెందిన సినిమా కాదు ఇది. తుసీవు విలన్ ల ఆట. ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో వున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలను నమ్మకండి. త్వరలో పాటలు, ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నాం. వీటి కోసం వేచి చూడండి. వాలిమైలో జరగిన తప్పులని తెలుసుకున్నాం. తమిళనాడులో `వారీసు` గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది` అని వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.