ఒక సినిమా మాత్రమే చేసిన నన్ను సుధీర్ బాబు నమ్మారు: దర్శకుడు కరుణకుమార్

Update: 2021-08-22 03:51 GMT
సుధీర్ బాబు కథానాయకుడిగా .. ఆనంది కథానాయికగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ప్రేమకథనే 'శ్రీదేవి సోడా సెంటర్'. ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్నరాత్రి నిర్వహించారు. ఈ వేడుకలో కరుణకుమార్ మాట్లాడాడు. "ఈ వేదికపై మాట్లాడిన ప్ర్రతి ఒక్కరూ 'పలాస' సినిమాను గురించి ప్రస్తావించారు. ఆ సినిమాతో నాకు మొదటి అవకాశం ఇచ్చిన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

'పలాస' సినిమాను చూసి నన్ను అభినందించడానికి సుధీర్ బాబు పిలిపించారు. నేను చేసింది ఒకటే సినిమా అయినా, ఆ తరువాత నేను చెప్పిన ఈ కథను వినగానే ఆయన ఓకే చెప్పారు. అందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ తరువాత ఈ కథను నిర్మాతలు విన్నారు .. నేను ఒక రూపాయితో చేద్దామని అంటే, వారు పది రూపాయలు ఖర్చు చేయడానికి ముందుకు వచ్చారు. శ్యామ్ దత్ వంటి కెమెరామెన్ ను ఇచ్చారు .. ఎడిటర్ శ్రీకర ప్రసాద్ గారిని నాకు ఇచ్చారు. దాంతో ఈ సినిమాను అనుకున్న దగ్గర నుంచి ఎలాంటి టెన్షన్స్ లేకుండా నడిచిపోయింది.

ఎవరు మ్యూజిక్ చేస్తే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది? అని ఆలోచన చేస్తే గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు మణిశర్మ గారు. వెంటనే వెళ్లి ఆయనకు కథ చెప్పాము. ఫస్టాఫ్ చెబుతూ ఉండగానే ఆయన 'చుక్కల మేళం' ట్యూన్ వినిపించారు. ఆయన గురించి ఎప్పటి నుంచో వింటూ ఉండటం వలన, ఆయన అంటే ఒక భయం ఉండేది. కానీ ఆయన నన్ను ప్రోత్సహించారు .. ఒక తమ్ముడిలా ఆదరించారు. నా దృష్టిలో ఆయన మనకి ఒక ఇళయారాజా. అలాంటి ఆయన అందించిన సహాకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను.

ఈ సినిమాను అనుకున్న ప్రకారం పూర్తి చేయడానికి కారణం నా టీమ్. వాళ్లందరి సహాయ సహాకారాలతోనే అది సాధ్యమైంది. వీళ్లందరి గురించి చాలా మాట్లాడాలని ఉంది. కానీ సమయాభావం వలన మాట్లాడలేకపోతున్నాను. థియేటర్లు ఓపెన్ అయిన తరువాత వస్తున్న పెద్ద సినిమా ఇది .. థియేటర్లలో మాత్రమే చూడవలసిన సినిమా ఇది. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూడండి. మేము ఎంత మంచి కథతో మీ ముందుకు వచ్చామనేది మీకు అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చాడు. 
Tags:    

Similar News