సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. కాస్త అదృష్టం ప్రతిభ ఉంటే ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్లవచ్చు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో ఎంతో మంది కూడా కింది స్థాయి నుండి స్టార్స్ గా ఎదిగిన విషయం తెల్సిందే. దర్శకుడు మారుతి కూడా చాలా కష్టాలు పడి వచ్చాడు. కెరీర్ ఆరంభంలో బూతు చిత్రాల దర్శకుడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నా కూడా ఇప్పుడు ఈయన సినిమాల కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూసే స్థాయికి చేరాడు. ఈ క్రమంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను పడ్డ కష్టాలను ఎదుర్కొన్న ఇబ్బందులను మొహమాటం లేకుండా షేర్ చేసుకుని అందరి హృదయాలను టచ్ చేశాడు. సినిమాలపై ఆసక్తితో ఆయన చాలా కష్టపడ్డాడు. తండ్రితో కలిసి అరటి పండ్లు అమ్మడం నుండి మొదలుకుని కొన్ని రోజుల పాటు ఆఫీస్ లో బాయ్ గా చేసిన ఘటనలు ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకుని సినిమాల్లో మెల్లగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మారుతి అంతకు ముందు ఆఫీస్ బాయ్ గా చేసి కాఫీలు టీలు.. జీరాక్స్ కాపీలు అందిస్తూ ఉండేవాడట. తాను ఏ పని చేసినా కూడా అది బతుకు దెరువు కోసం చేశాను.
గ్రాఫిక్స్ డిజైనర్ గా చేస్తున్న సమయంలో అల్లు వారితో పరిచయం ఆ తర్వాత మెల్లగా దర్శకుడిగా ఈరోజుల్లో సినిమాను చేయడం వంటివి జరిగాయి. అలా ఒక్కో మెట్టు ఎక్కి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పొజీషన్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయనతో వర్క్ చేసేందుకు యంగ్ స్టార్స్ ఆసక్తిగా ఉన్నారు అంటే ఆయన జీవితంలో చాలా సాధించాడు అని చెప్పుకోవడానికి ఇదో ఉదాహరణ. ప్రతి రోజు పండుగే చిత్రం తర్వాత సమ్మర్ లో సినిమాను షురూ చేయాలనుకున్న మారుతికి కరోనా అడ్డు తగిలింది. ఈ లాక్ డౌన్ టైంను వృదా చేయకుండా స్క్రిప్ట్ లు రెడీ చేసుకున్న మారుతి వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట.