శ్రీరాముడు పాలకుడిగా ఉన్నా ఇదే చెప్పేవాడన్న దర్శకుడు

Update: 2020-03-24 10:30 GMT
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో స్వీయ నియంత్రణ.. స్వీయ శుభ్రత ఇంకా గృహ నిర్భందంతోనే ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతున్నారు. ఇండియాలో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌ డౌన్‌ ను ప్రకటించాయి. అయినా కూడా జనాలు కొందరు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ప్రముఖులు జనాలను బయటకు రావద్దంటూ సూచిస్తూ మెసేజ్‌ లు పోస్ట్‌ లు పెడుతున్నారు.

కరోనా వ్యాప్తి మీ వల్లే చెందుతుంది. డాక్టర్లు ఏమాత్రం దీన్ని అదుపులో ఉంచలేరు. వారే ప్రమాదపు అంచులో ఉన్నారు. దీని నివారణ మీ చేతుల్లోనే ఉంది. ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండటమే అసలైన మందు అంటూ సోషల్‌ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. వైరల్‌ అయిన ఒక పోస్ట్‌ ను దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి రీ ట్వీట్‌ చేసి ఆసక్తికర కామెంట్‌ చేశాడు.

ప్రస్తుతం శ్రీరామ చంద్రుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నా కూడా ఇదే మాటలు చెప్పేవారేమో. ఇంట్లోంచి ఎవరైనా బయటకు వస్తే అరెస్ట్‌ లు చేయించేవాడేమో అంటూ దర్శకుడు ట్వీట్‌ చేశాడు. దర్శకుడి ట్వీట్‌ ను మంచు మనోజ్‌ రీ ట్వీట్‌ చేసి మీరు చెప్పింది నిజమే సర్‌ అంటూ కామెంట్‌ పెట్టాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మోహనకృష్ణ ఇంద్రగంటి ట్వీట్‌ సరిగ్గా సూట్‌ అయ్యింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తుంటే కొందరు మాత్రం ట్రోల్స్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News