'గీత గోవిందం' సినిమాతో దర్శకుడిగా తనని తాను పరశురామ్ నిరూపించుకున్నాడు. ఆ సినిమా చూసిన తరువాతనే పరశురామ్ పై మహేశ్ బాబుకి నమ్మకం కలిగింది. ఆ తరువాత ఈ సినిమాలో తన పాత్ర .. క్యారెక్టరైజేషన్ గురించి విన్న తరువాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా మైత్రీ .. 14 రీల్స్ బ్యానర్లపై పట్టాలెక్కిన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదలైంది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల షేర్ కి దగ్గరగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను కర్నూల్లో నిర్వహించారు.
భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేదికపై పరశురామ్ మాట్లాడుతూ .. "నేను చాలా ఇంటర్వ్యూ లలో చెప్పాను .. కర్నూల్ కి నాకు అవిమాభావ సంబంధం ఉందని. 'ఒక్కడు' సినిమా చూసిన తరువాతనే నేను ఇండస్ట్రీకి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. నేను ఎంతగానో ప్రేమించే సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాకు నేను డైరెక్టర్ ను కావడం .. ఇక్కడికి ఈ ఫంక్షన్ కి రావడం జరిగింది. నిజంగా నాకు లైఫ్ టైమ్ గిఫ్ట్ ఇది. ఈ సందర్భంగా నేను మహేశ్ గారికి థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట.
కనిపించిన ప్రతిసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పినా ఈ రుణం తీరదు. ఈ సినిమాలో తీసిన ప్రతి ఫ్రేము .. ప్రతి సీను .. ప్రతి డైలాగ్ అన్నీ కూడా ఆయన మీద నాకున్న ప్రేమనే. నా శక్తిమేరకు ప్రయత్నించి నేను ఆయనకి ఒక అద్భుతమైన హిట్ ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ .. అలాగే ఈ సినిమాను ఇంతగా బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను.
ఈ సినిమా కోసం నేను ఏది అడిగితే అది ఇచ్చి .. నేను అనుకున్నట్టుగా తీయగలిగేలా చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా వారు కూడా ఈ సినిమా ఇంతగా జనంలోకి వెళ్లడానికి తమ వంతు సహకారాన్ని అందించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞతలు అందజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా ఈ సినిమాను ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించారు.