నారా రోహిత్.. ఈ తరం విక్టరీ వెంకటేష్

Update: 2016-03-30 09:44 GMT
కొత్తగా నారా రోహిత్‌ కు వెంకటేష్‌ కు పోలిక ఏంటి అనిపిస్తోందా? ఇది నారా బాబుతో సినిమా తీసిన దర్శకుడు చెబుతున్న మాటలెండి. అన్ని వర్గాల ప్రేక్షకులకూ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ కు చేరువ కావాలని రోహిత్ చాలా తపిస్తాడని.. ఒకప్పుడు వెంకటేష్ కూడా ఇలాగే ఆలోచించి అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువయ్యాడని.. ఈ తరానికి వెంకటేష్ పాత్రను రోహిత్ పోషిస్తున్నాడని చెప్పాడు ‘సావిత్రి’ సినిమా దర్శకుడు పవన్ సాధినేని.

‘సోలో’ సినిమాతో తర్వాత మళ్లీ రోహిత్‌ ను మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చూడాలని చాలామంది ఆశించారని.. ఆ కోరికను ‘సావిత్రి’ తీరుస్తుందని పవన్ చెప్పాడు. రోహిత్ ఇందులో మెడికోగా కనిపిస్తాడని.. అతడి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ అని అతనన్నాడు. హీరోయిన్ పేరునే టైటిల్‌ గా పెట్టడానికి నారా రోహిత్ ఎలా ఒప్పుకున్నాడని అడిగితే.. ‘‘రోహిత్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అతను కథకు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. రోహిత్ కెరీర్ చూస్తే అన్నీ కథాబలమున్న సినిమాలే కనిపిస్తాయి. సబ్జెక్ట్ నచ్చడంతో టైటిల్ విషయంలో ఏమాత్రం అభ్యంతరపెట్టలేదు’’ అని పవన్ అన్నాడు.

వారం రోజుల్లో ‘సర్దార్’ సినిమా వస్తుండగా సినిమా రిలీజ్ చేయడం సాహసం కాదా అని పవన్‌ను అడిగితే.. ‘‘వేసవి మొదలయ్యాక చాలా సినిమాలకు స్కోప్ ఉంటుంది. ప్రేక్షకులు రెండు మూడు రకాల సినిమాలు థియేటర్లలో ఉండాలని కోరుకుంటారు. ఎంత పోటీ ఉ్నా మా సినిమా మీద మాకు నమ్మకముంది. కాబట్టి ‘సర్దార్’ వచ్చాక కూడా జనాలు మా సినిమాను చూస్తారన్న నమ్మకముంది’’ అని చెప్పాడు.
Tags:    

Similar News