మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో చరణ్ నటించబోతున్నట్లుగా చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. మొదట ఆ పాత్రకు మహేష్ బాబును ఎంపిక చేయడం జరిగిందనే ప్రచారం జోరుగా సాగింది. కాని ఏవో కారణాల వల్ల ఫైనల్ గా చరణ్ ను ఆచార్యలో నటింపజేయాలని కొరటాల శివ కూడా నిర్ణయించుకున్నాడు. చిరంజీవి చరణ్ సీన్స్ పై అంచనాలు భారీగా ఉంటాయి. కనుక ఆ సీన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మొదట చిరంజీవి చరణ్ ల కాంబోలో కొన్ని సీన్స్ ను టెస్టు గా చిత్రీకరించి అంతా ఓకే అనుకుంటే అప్పుడు పూర్తి స్థాయి చిత్రీకరణ జరుపబోతున్నారు. షూటింగ్స్ కు అనుమతించిన వెంటనే టెస్టు షూట్ ను నిర్వహించి ఆ తర్వాత మార్పులు చేర్పులు చేయాలా లేదంటే మరో వర్షన్ లో చేయాలా అనే విషయాలపై నిర్ణయం తీసుకుని కొరటాల శివ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ చిత్రం షూటింగ్ ను జూన్ లేదా జులైలో పూర్తి చేసి ఖచ్చితంగా ఆగస్టు లో విడుదల చేయాలని భావించారు. కాని ఈ మహమ్మారి కరోనా కారణంగా సినిమా విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్ గా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే లీక్ అయిన ఫొటోలు మరియు వీడియోలను బట్టి అర్థం అవుతుంది.