బుల్లితెరలో సత్తా చాటుకుని.. వెండితెర వైపు అడుగులేసిన దర్శకుడు ప్రభాకర్ ఇండస్ట్రీ జనాల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రభాకర్.. తాజాగా ‘బ్రాండ్ బాబు’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండస్ట్రీలో తనకు తెలిసిన వాళ్లను చిన్న సాయం అడిగితే చేయడానికి ముందుకు రాలేదని అతను విమర్శించాడు. టీజర్ లింక్ ట్వీట్ చేయాలని అడిగినా వాళ్లు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అతనన్నాడు. కమెడియన్ వెన్నెల కిషోర్ మంచి మనసున్న వాడని.. అతను ఈ విషయంలో సాయం చేశాడని.. యాంకర్ ప్రదీప్ కూడా తన వంతు తోడ్పాటు అందించాడని.. కానీ ప్రదీప్ కు ఉన్నంత ఇంగితం కూడా మిగతా వాళ్లకు లేకపోయిందని ప్రభాకర్ విమర్శించాడు.
‘బ్రాండ్ బాబు' మూవీకి ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలనుకున్నపుడు ఎవరితో చేయించాలని చాలా ఆలోచించామని.. మారుతిని అడిగితే వెన్నెల కిషోర్ కు విషయం చెప్పారని... అతను తాము అడిగిన వెంటనే ఓకే చెప్పాడని... కానీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న తన సన్నిహితుల్ని అడిగితే మాత్రం స్పందన లేదని ప్రభాకర్ తెలిపాడు. నో చెప్పేస్తే రేపు తాను ఎక్కడైనా అవసరం వస్తానేమో అని ఆలోచించి నో చెప్పలేదని అన్నాడు. అదే సమయంలో ఎస్ అంటే వారికి తక్కువగా అనిపించిందేమో అని ప్రభాకర్ చెప్పాడు. కొందరు స్పందించినా.. ట్వీట్ చేస్తానని చెప్పి సైలెంటుగా ఉండిపోయారని.. కానీ వెన్నెల కిషోర్ మాత్రం తాను ఈ చిత్రంలో నటించకపోయినా తమకు సాయం చేశఆడని అతను మంచి మనిషని చెప్పాడు. ఇండస్ట్రీ బావుంటే అందరం బాగుంటామని.. మన సినిమానే బాగుండాలని అనుకోకూడదని.. అలా అనుకుంటే ఈ రోజు ప్రపంచం నలుమూలలకు తెలుగు సినిమా పాకేది కాదని.. రాజమౌళి ‘బాహుబలి’ ఆ స్థాయికి వెళ్లేది కాదని ప్రభాకర్ అన్నాడు. తాను సాయం అడిగితే చేయని వాళ్ల పేర్లు బయటికి చెప్పాలని లేదని.. ఆల్రెడీ తన దగ్గర వాళ్ల పరువు పోయిందని.. ఇంకా వాళ్ల పరువు తీయాల్సిన అవసరం లేదని ప్రభాకర్ చెప్పాడు.