బుల్లితెర మీద నటుడిగా.. హోస్టుగా.. నిర్మాతగా పేరు సంపాదించి.. వెండితెరపైనా నటుడిగా కనిపించి.. ఇప్పుడు దర్శకుడిగా మారిపోయాడు ప్రభాకర్. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘నెక్స్ట్ నువ్వే’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఐతే ఈ సినిమా విడుదల కాకముందే దర్శకుడిగా ఇంకో రెండు అవకాశాలు వచ్చాయని.. అందులో ఒక సినిమా పూర్తి కావస్తోందని ప్రభాకర్ చెప్పడం విశేషం.
దర్శకుడు మారుతి ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నానని.. ఆ సినిమా 75 శాతం పూర్తయిందని అతను వెల్లడించాడు. అలాగే మరో సినిమాకు స్క్రిప్టు పూర్తయిందని.. జ్నానవేల్ రాజా నిర్మాణంలో ఆ సినిమా ఉంటుందని అతను చెప్పాడు. ‘నెక్స్ట్ నువ్వే’ నిర్మాత బన్నీ వాసుకు మారుతి క్లోజ్. ఇక జ్నానవేల్ రాజా ‘నెక్స్ట్ నువ్వే’లో నిర్మాణ భాగస్వామి. ఇలా వీళ్లిద్దరూ ప్రభాకర్ టాలెంట్ చూసి తమ బేనర్లలో ఛాన్సులిచ్చారన్నమాట.
ఇక తన తొలి సినిమాగా తాను ఓ రీమేక్ చేయడానికి ఇష్టపడలేదని.. ఐతే బన్నీ వాసు ‘యామిరుక్కు భయమే’ సినిమా చూపించాక తన ఆలోచన మారిందని.. ఈ సినిమా మూల కథ తీసుకుని.. తన క్రియేటివిటీని జోడించి సినిమా తీశానని ప్రభాకర్ చెప్పాడు. ఈ సినిమా తీసేందుకు రెండేళ్ల కిందటే అన్నీ రెడీ అయినప్పటికీ రీమేక్ హక్కుల విషయంలో వివాదం వల్ల ఏడాదిన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని.. చివరికి అన్ని ఇబ్బందులూ తొలగిపోయి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిందని.. కేవలం 37 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశానని ప్రభాకర్ తెలిపాడు.