అదేంటీ అప్పుడే జ‌క్క‌న్న‌తో పోలికా?

Update: 2022-04-14 23:30 GMT
క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` సైలెంట్ గా వ‌చ్చి ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. హీరో య‌ష్ , డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ని పాన్ ఇండియా స్టార్ లుగా నిల‌బెట్టింది. తాజాగా ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందిన `కేజీఎఫ్ 2` ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌లైంది. ఐదు భాష‌ల్లోనూ భారీ ఓపెనింగ్స్ ని రాబ‌ట్టి సంచ‌ల‌నాల‌కు తెర‌లేపింది. మ‌రీ ప్ర‌ధానంగా తెలుగు, క‌న్న‌డ‌, హిందీ రీజియ‌న్ ల‌లో ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని రాబ‌ట్టింది.

బాలీవుడ్ లోనూ ఈ మూవీ చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఇప్ప‌టికే పుష్ప‌, ట్రిపుల్ ఆర్ సంచ‌ల‌నాలు సృష్టించిన నేప‌థ్యంలో ద‌క్షిణాది నుంచి విడుద‌ల‌వుతున్న `కేజీఎఫ్ 2` కూడా రికార్డులు కొల్ల‌గొడితే మా ప‌రిస్థితి ఏంట‌నే దిగులు బాలీవుడ్ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే మొద‌లైంది కూడా. ఇదిలా వుంటే సోష‌ల్ మీడియా లో ఓ వ‌ర్గం మాత్రం ప్ర‌శాంత్ నీల్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆశ్చ‌ర్య‌క‌రంగా స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళితో పోలుస్తూ సంచ‌ల‌న చ‌ర్చ‌కు తెర‌లేపింది.

రాజ‌మౌళి కంటే మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌ని అందించ‌డంతో ప్ర‌శాంత్ నీల్ బెట‌ర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించ‌డం మొద‌లుపెట్టింది. అంతే కాకుండా మాస్ ఎలివేష‌న్ సీన్ ల‌ని తెర‌కెక్కించ‌డం లో రాజ‌మౌళిని ద‌ర్శ‌కుడు మించిపోయాడంటున్నారు. అంతే కాకుండా కేజీఎఫ్ లాంటి సినిమా తీయ‌డానికి రాజ‌మౌళికి దాదాపు ప‌దేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అయితే ప్ర‌శాంత్ మాత్రం చాలా త‌క్కువ స‌మ‌యంలోనే తీసేస్తాడ‌ని కామెంట్ లు చేస్తున్నారు.

ఇదిలా వుంటే మ‌రో వ‌ర్గం మాత్రం ఇది స‌రికాద‌ని వాదిస్తోంది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప‌నిత‌నాన్ని ప్ర‌శంసిస్తూనే రాజ‌మౌళినితో అత‌న్ని పోల్చ‌డం స‌రికాద‌ని చీవాట్లు పెడుతోంది. రాజ‌మౌళి ఇప్ప‌టికి వ‌రుస‌గా 12 హిట్ ల‌తో టాప్ లో నిలిచార‌ని, అలా వ‌రుస హిట్ ల‌తో ఇప్ప‌టికీ అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా స‌రికొత్త రికార్డుని జ‌క్క‌న్న నెల‌కొల్పాడ‌ని, అంటే కాకుండా ప్రాంతీయ సినిమా అనే భావ‌న‌ని `బాహుబ‌లి`తో చెరిపేసి తెలుగు సినిమాకు ఎన‌లేని కీర్తిని తీసుకొచ్చాడ‌ని జ‌క్క‌న్న‌కు స‌పోర్ట్ గా నిలుస్తున్నారు.

ప్ర‌శాంత్ నీల్ లో అద్భుత‌మైన ప్ర‌తిభ వుంది. కానీ అది రాజ‌మౌళిని అధిగ‌మించేంత కాద‌ని, ఈ విష‌యంలో రాజ‌మౌళికి, ప్ర‌శాంత్ నీల్ కు చాలా వ్య‌త్యాసం వుంద‌ని, జ‌క్క‌న్న లార్జ‌ర్ దెన్ లైఫ్ సినిమాల‌ని చేస్తూ వెళుతున్నాడ‌ని, ప్ర‌శాంత్ నీల్ ఆయ‌న స్ఫూర్తితో అదే బాట‌లో వెళుతున్నాడే కానీ ఆయ‌న‌ని ఓవ‌ర్ టేక్ చేసేంత ప్ర‌శాంత్ నీల్ లో లేద‌ని కొంత మంది నెటిజ‌న్ లు వాదిస్తున్నారు.
Tags:    

Similar News