ద‌ర్శ‌కేంద్రుడు కూడా బుక్ రాసేస్తున్నారు

Update: 2022-05-17 13:30 GMT
చాలా మంది కెరీర్ చివ‌రి ద‌శ‌లో త‌మ మ‌ధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ త‌మ కెరీర్ లో ఎదుర్కొన్న అనుభ‌వాలు, జ్ఞాప‌కాల‌తో ఆటోబ‌యోగ్ర‌ఫీల‌ని రాస్తున్నారు. ఇన్నాళ్ల‌కు ఈ జాబితాలో ద‌ర్శ‌కేంద్ర‌డు కె. రాఘ‌వేంద్ర‌రావు కూడా చేరిపోయారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కేంద్ర‌డు కె. రాఘ‌వేంద్ర‌రావుది ప్ర‌త్యేక శైలి. పాట‌ల్లో హీరోయిన్ ల‌ని అందంగా చూపిస్తూ త‌న‌దైన ముద్ర వేశారు. రొమాంటిక్ సాంగ్ చేయాల‌న్నా.. హీరోయిన్ ల‌ని అందంగా వెండితెర‌పై ఆవిష్క‌రించాల‌న్నా ఆయ‌న త‌రువాతే ఎవ‌రైనా అనే ముద్ర‌ని క్రియేట్ చేసుకున్నారు. చాలా మంది హీరోయిన్ గ్లామ‌ర్ ట‌చ్ కోసం ఆయ‌న సినిమాల్లో చేయాల‌ని ఉవ్విళ్లూరిన వారు కూడా వున్నారు.

విజ‌య‌శాంతి, శ్రీ‌దేవి, రాధ‌, భాను ప్రియ వంటి క్రేజీ హీరోయిన్ ల‌కు గ్లామ‌ర్ డాల్స్ గా ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చిపెట్టిన ద‌ర్శ‌కుడి కె. రాఘ‌వేంద్రరావుకు ప్ర‌త్యేక స్థానం వుంది. అంతే కాకుండా 100కు పైగా చిత్రాల‌ని అందించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. స్వ‌ర్గీయ ఎన్. టి. రామారావు నుంచి నితిన్ వ‌ర‌కు అంద‌రి హీరోల‌తో వ‌ర్క్ చేశారు. అద్భుత‌మైన చిత్రాల‌ని అందించారు. ఇక ఇండ‌స్ట్రీకి విక్ట‌రీ వెంక‌టేష్‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ ల‌ను ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఆయ‌న‌దే.

ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్‌, ఏ ఎన్నార్‌, సూప‌ర్ స్టార్ కృష్ణ‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్‌, నితిన్ వంటి అందిరి హీరోల‌తోనూ క‌లిసి ఎన్నో సూప‌ర్ హిట్ ల‌ని అందించారు. అలాంటి ఆయ‌న త‌న వృత్తిప‌ర‌మైన‌, వ్య‌క్తిగ‌త‌మైన మ‌ధుర జ్ఞాప‌కాల‌తో ఓ పుస్త‌కాన్ని రాశారు. దానికి `నేను సినిమాకి రాసుకున్న ప్రేమ‌లేఖ‌` అని పేరు పెట్టారు. ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి సుధా రామ‌మూర్తి ఈ పుస్తకాన్ని ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఈ పుస్త‌కంపై రాఘ‌వేంద్ర‌రావు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. `నేను సినిమాతో ఐదు ద‌శాబ్దాలుగా ప్ర‌యాణిస్తున్నాను. ఈ ప్ర‌యాణంలో ఎన్నో చూశాను. ఎన్నో ఎత్తు ప‌ల్లాలు ఎదుర్కొన్నాను. అవ‌న్నింటినీ ఈ పుస్త‌కంలో పొందుప‌ర‌చాల‌నుకున్నాను. అదే `నేను సినిమాకు రాసుకున్నప్రేమ‌లేఖ‌`. కొంచెం తీపి, కొంచెం మ‌సాలా క‌లిపి ఈ పుస్తకాన్ని రాశాను. ఈ బుక్ ని శ్రీ‌మ‌తి శ్రీ‌మ‌తి సుధా రామ‌మూర్తి విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో ఇది ప్ర‌ముఖ బుక్ హౌస్ ల‌లో అందుబాటుతోకి రానుంది. అలాగే ఆన్ లైన్ లోనూ ల‌భించ‌బోతోంది` అని తెలిపారు.

రాఘ‌వేంద్ర‌రావు సినీ జీవితం గురించి చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఆయ‌న గురించి వివ‌రంగా తెలుసుకోవాల‌ని చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి త‌నే స్వ‌యంగా రాసిన బుక్ లో రాఘ‌వేంద్ర రావు అన్ని విష‌యాల్ని వెల్ల‌డించారా? .. వెల్ల‌డిస్తే ఆ అంశాలు ఎలా వుండ‌బోతున్నాయి అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News