రణ్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి పార్క్ హయత్ లో జరిగింది. కరణ్ జొహార్ నిర్మించిన ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తున్నారు. రణ్ బీర్ .. అలియా .. నాగార్జున .. ఎన్టీఆర్ పాల్గొన్న ఈ ఈవెంట్ లో రాజమౌళి తనదైన శైలిలో మాట్లాడారు.
ఈ ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాము. మీరంతా చూస్తే చాలా బాగుంటుందని అనిపించింది. రెండు వారాలుగా టీమ్ అంతా చాలా కష్టపడింది. అంతా సెట్ అయిపోయింది .. ఈవెంట్ అదిరిపోతుంది అనుకుంటే, చివరి నిమిషంలో అంతా మారిపోయింది. అలా జరగడానికి కారణం కరణ్ జొహార్ గారు వినాయకుడి పూజను సరిగ్గా చేయకపోవడమేనని అనిపించింది .. ఏదో తేడాగా చేయడం వల్లనే ఇలా జరిగింది అంటూ నవ్వేశారు.
రణ్ బీర్ కి ఈ సినిమాలో ఫైర్ తో ఒక సంబంధం ఉంటుంది. అందువలన ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసిన ఈవెంట్ లో ఫైర్ కి సంబంధించిన ఒక ఐటమ్ ను సెట్ చేశాము. 'తొడగొట్టు చిన్నా' అని రణ్ బీర్ అనగానే ఎన్టీఆర్ తొడగొడతాడు. అప్పుడు స్టేజ్ ఫైర్ ఐటమ్ ఓపెన్ అవుతుంది. ఇదంతా కూడా నేను ఆడియన్స్ లో కూర్చుని ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఆ ఐటమ్ ను బ్రహ్మాస్త్ర సక్సెస్ ఈవెంట్ లో మీకు చూపిస్తాను.
కరణ్ జొహార్ గారు చేసే సినిమాలకి .. నేను తీసే సినిమాలకి ఏ మాత్రం సంబంధం ఉండదు. కానీ సినిమాల పట్ల ఆయనకి గల ప్యాషన్ నాకు నచ్చుతుంది. 'బ్రహ్మాస్త్ర' కథ విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చేసింది.
ఎందుకంటే నేనే కాదు చాలామంది పిల్లలు చిన్నప్పుడు బాణాలు తయారు చేసుకుని .. వాటికి అస్త్రాల పేర్లు పెట్టుకుని ఆడుకోవడం జరిగింది. అప్పట్లోనే వాటిలో ఏదో పవర్ ఉందని ఊహించుకునేవాళ్లం. అలాంటి అస్త్రాలను ఉపయోగించే సూపర్ హీరోలను కూడా ఎంతగానో ఇష్టపడేవాళ్లం.
ఇలాంటి సూపర్ పవర్స్ ఉన్న సూపర్ హీరోలకి సంబంధించిన కథలు మన పురాణాల్లో .. ఇతిహాసాల్లో .. జానపదాల్లో ఉన్నాయి. అలా బ్రహ్మాస్త్రకి సంబంధించిన కథలు మనం వింటూ పెరిగాము. అలాంటి ఒక కథతో వస్తున్న ఈ సినిమాను సపోర్ట్ చేయవలసిఉంది అవసరం ఉంది . అందుకు కోసమే నా వంతు సపోర్ట్ ను నేను అందిస్తున్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View