ముందే ప్రిపేర్ చేయ‌క‌పోవ‌డ‌మే ఆదిపురుష్‌ త‌ప్పు!-ఆర్జీవీ

Update: 2022-10-11 17:45 GMT
ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా న‌టించిన ఆదిపురుష్ టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజై తీవ్ర దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇందులో రావ‌ణుడి పాత్ర‌ను ఒక ముస్లిమ్ రూపంతో చూపించార‌ని వీ.ఎఫ్.ఎక్స్ గ్రాఫిక్స్ వ‌ర్క్ నాశిర‌కంగా ఉంద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ఆంజ‌నేయుడి రూపాన్ని తోలు కప్పుకుని ఉన్న‌ట్టు చూపించార‌ని కూడా కొంద‌రు సెటైర్లు వేసారు.

అయితే ఆదిపురుష్ టీజ‌ర్ చూడ‌గానే ఫ‌స్ట్ రెస్పాన్స్ ఇలా ఉండ‌డానికి కార‌ణాలేమిటో ప‌లువురు ప‌లు ర‌కాలుగా విశ్లేషిస్తున్నారు. తాజాగా ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ త‌న‌దైన శైలిలో దీనిని విశ్లేషించారు. నిజానికి ఓంరౌత్ బృందం చాలా ముందు నుంచే ప్ర‌జ‌ల‌ను ప్రిపేర్ చేసి ఉండాల్సింద‌ని ఆర్జీవీ అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మ సినిమాలో పాత్ర‌లు పూర్తిగా ఫిక్ష‌న‌ల్ గా ఎంపిక చేసుకున్న‌వ‌ని ముందే చెప్పలేదు.

అందుకే స‌డెన్ గా ఈ రూపాల్ని టీజ‌ర్ లో చూడ‌గానే అభిమానులు షాక్ తిన్నారు.. ఒక ఫిలింమేక‌ర్ గా నేను కూడా న‌మ్మ‌లేదు అని రామ్ గోపాల్ వ‌ర్మ అన్నారు. ఆర్.ఆర్.ఆర్ లో పాత్ర‌లు ఫిక్ష‌న‌ల్ అని ముందు నుంచి ప్రిపేర్ చేసార‌ని ఏదీ దాచ‌లేద‌ని కూడా రామూజీ ఉద‌హ‌రించారు. అందుకే  అల్లూరి భీమ్ పాత్ర‌ల‌ను అర్థం చేసుకున్నార‌ని అన్నారు.

ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని ఎదుటివారిపై వెంట‌నే రుద్దేస్తార‌ని అయితే ఆదిపురుష్ టీజ‌ర్ చూడ‌గానే అలాంటి ఫీలింగ్ క‌ల‌గ‌డం స‌హ‌జ‌మేన‌ని కూడా అన్నారు. రామాయ‌ణం స్ఫూర్తితో తీసినా కానీ ఫిక్ష‌న‌ల్ పాత్ర‌ల‌ను చూపిస్తున్నామ‌ని చిత్ర‌బృందం ముందుగా లుక్ లు విడుద‌ల చేసి ప్రిపేర్ చేసి ఉంటే ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌య్యేది కాద‌ని కూడా సూచించారు. ఎస్వీఆర్ - ఎన్టీఆర్ ల రూపాల‌ను రాముడిగా కృష్ణుడిగా చూశాక .. అది మైండ్ లో ప్రింట్ అయిపోతుంద‌ని ఆ త‌ర్వాత వేరొక‌రిని అలా చూడ‌లేమ‌ని కూడా రామూజీ అన్నారు. ఇప్పుడు సైఫ్ ని ముస్లిమ్ గా చూడ‌టానికి కార‌ణం కూడా అలాంటిదే. అత‌డి రూపం ముందుగా తెలుగు వారికి తెలియ‌ద‌ని కూడా అన్నారు.

సైఫ్ అనే పేరు వ‌ల్ల అలా చూస్తున్నార‌ని అన్నారు. అయితే ఇలా అవుతుంద‌ని సైఫ్ కూడా ఊహించి ఉండ‌డ‌ని కూడా రామ్ గోపాల్ వ‌ర్మ అన్నారు. అస‌లు జీరో నాలెజ్ తో సైఫ్ ఈ సినిమాలో న‌టించి ఉంటాడ‌ని  కూడా రామూ అభిప్రాయ‌ప‌డ్డారు. సైఫ్ తో పోలిస్తే ప్ర‌భాస్ రూపం భీక‌రంగా క‌నిపిస్తోంది. అత‌డే రావ‌ణుడిగా క‌నిపించాడు నాకు! అని కూడా రామ్ గోపాల్ వ‌ర్మ త‌న‌దైన దృక్కోణాన్ని వ‌ర్ణించి చెప్పారు. మొత్తానికి ఆర్జీవీ ఈ ఇంట‌ర్వ్యూలో ఎంతో క‌న్విన్సింగ్ గా ప్ర‌తిదీ వివ‌రించిన తీరు ఆక‌ట్టుకుంది. ఇక సైఫ్ రూపాన్ని ఇప్పుడు మార్చాల‌నే ఆలోచ‌నే రాంగ్ అని కూడా అన్నారు. విమ‌ర్శ‌కుల‌ను న‌మ్మి అత‌డి రూపాన్ని మార్చాల‌నుకుంటే అది మూర్ఖ‌త్వ‌మ‌ని కూడా వ‌ర్మ అన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News