లేడీ డైరెక్టర్ తో రాజ్ తరుణ్!

Update: 2016-06-21 12:09 GMT
చేసినవి ఐదు సినిమాలు.. అందులో 4 కమర్షియల్ హిట్స్. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న హీరోతో సినిమా చేసేందుకు డైరెక్టర్లు క్యూ కట్టాలి.. నిర్మాతలు వెంటబడాలి. కానీ యంగ్ హీరో రాజ్ తరుణ్ సిట్యుయేషన్ కొంచెం డిఫరెంట్. రాంగ్ గైడెన్స్ కారణంగా.. తను సూపర్ మల్టీ ట్యాలెంటెడ్ అనుకుంటాడని.. అలాంటి ఫీలింగ్ ని పైకి ఎక్స్ ప్రెస్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడడనే టాక్ ఉంది. దీంతో పెద్ద డైరెక్టర్లతో సినిమాలు మనోడి చేతి వరకూ రావడం లేదు.

ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో 3-4 సినిమాలున్నాయి. అన్నీ కొత్త దర్శకులవే. ఓ సినిమాకి అయితే తను చెప్పినట్లు తీయడం లేదని.. మార్చేసి మరో కొత్త డైరెక్టర్ ని కూడా తెచ్చేశాడు. ఇప్పుడు ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఓ లేడీ డైరెక్టర్ రూపొందించనుంది. ఆ దర్శకురాలి పేరు సంజన. ఈమె హీరోయిన్ సంజన కాదు.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దగ్గరి వ్యక్తి ఈమె.

కామెడీ ప్రధానాంశంగా రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రం కోసం.. ఓ పెద్ద హీరోయిన్ ని తెచ్చేందుకు ట్రై చేస్తున్నట్లు సమాచారం. గిబ్రాన్ సంగీతం అందించనున్నాడు.
Tags:    

Similar News