భారతదేశంలో బెస్ట్ హీరోయిన్లతో పని చేసే అవకాశం అదృష్టం అందరికీ ఉండదు. అయితే కళాత్మక చిత్రాల దర్శకుడు భన్సాలీ మాత్రం తన కెరీర్ లో ఇండియాస్ బెస్ట్ హీరోయిన్లతో పని చేసారు.
ఆయన తెరకెక్కించిన హమ్ దిల్ దే చుకే సనమ్-దేవదాస్- గుజారిష్- పద్మావత్- భాజీరావ్ మస్తానీ- రామ్ లీల- గంగూభాయి కతియావాడీ .. వీటన్నిటిలో నటించిన తారలు దేశంలోనే అత్యుత్తమ ప్రతిభావంతమైన తారలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హమ్ దిల్ దే చుకే సనమ్ లాంటి ప్రేమకథా చిత్రంలో సల్మాన్ ఖాన్ - ఐశ్వర్యారాయ్ జంటగా నటించగా.. ఐశ్వర్యారాయ్ తో దేవదాస్ తెరకెక్కించారు భన్సాలీ. ఇందులో ఐష్ తో పాటు మాధురి ధీక్షిత్ లాంటి మేటి హీరోయిన్ నటించారు.
`భాజీరావ్ మస్తానీ` చిత్రంలో నటించిన దీపిక ఆ తర్వాత పద్మావత్ లోనూ నటించింది. ఈ రెండు చిత్రాలకు భన్సాలీ దర్శకత్వం వహించారు. ప్రయాంక చోప్రా రామ్ లీలలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇకపోతే ఇప్పుడు గంగూభాయి కథియావాడీ చిత్రంతో ఆలియా భట్ ఖ్యాతి విశ్వవిఖ్యాతం కానుంది.
కామాటిపురా అధినేత్రి గంగూభాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆలియా నాయికగా దాదాపు 200కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఇందులో ఆలయా తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేయనుంది. ఈ సినిమాతో ఆలియాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు ఖాయమన్న చర్చా సాగుతోంది. ఈ శుక్రవారం గంగూభాయి చిత్రం థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీ షోతో ముంబైలో సందడి నెలకొంది.
ఇకపోతే భన్సాలీ తన కెరీర్ లో బెస్ట్ హీరోయిన్లతో పని చేశారు. ఐశ్వర్యారాయ్ - మాధురి ధీక్షిత్- దీపిక పదుకొనే- ప్రియాంక చోప్రా- ఆలియా భట్ లాంటి తారలతో పని చేశారు. అంతకుముందు జనరేషన్ లోనూ బెస్ట్ హీరోయిన్లతో కలిసి పని చేసిన ఘనత ఆయనకే చెల్లింది. భన్సాలీలోని కళాత్మకతకు ఆయన రేంజుకు తగ్గ నాయికలుగా సదరు భామలకు అంతే గుర్తింపు దక్కింది.