కరణ్ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పడంపై డైరెక్టర్ సెటైర్లు..!

Update: 2022-10-12 14:30 GMT
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నానని.. అందుకోసమే ట్విట్టర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లుగా కరణ్ పేర్కొన్నారు. అయితే ఆయన నిర్ణయంపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, 'ది కాశ్మీర్ ఫైల్స్' ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తాజాగా కరణ్‌ జోహార్ పై పరోక్షంగా సెటైర్లు వేసాడు. 'నిష్క్రమించిన వారు ఎప్పుడూ గెలవరు.. విజేతలు ఎప్పటికీ నిష్క్రమించరు' అని దర్శకుడు ట్వీట్ చేసాడు. అక్కడితో ఆగకుండా కపటత్వాన్ని లేదా నకిలీలను అనుమతించనందున ట్విట్టర్‌ ను మాత్రమే వదిలేస్తారు.. కానీ ఇన్‌స్టాగ్రామ్‌ ని వదలరని వ్యగ్యంగా పేర్కొన్నారు.

పాజిటివ్ ఎనర్జీని కోరుకునే నిజమైన వ్యక్తులు సోషల్ మీడియాను పూర్తిగా వదిలివేస్తారని నేను నమ్ముతున్నాను. అబద్ధాలను, నకిలీలను అనుమతించనందున ట్విట్టర్‌ ను మాత్రమే వదిలిస్తారు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌ ని వదలరు. ఎందుకంటే అది బ్రాండ్‌ లను పొందదేలా చేస్తుంది.. అది ఫేక్ నెస్ ని కూడా ఒప్పుకుంటుంది. అది ప్రతికూలని ప్రసారం చేసి జీవితాలను నాశనం చేస్తుంది" అని వివేక్ అగ్నిహోత్రి రాసుకొచ్చాడు.

ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన కరణ్ జోహార్.. ఇన్స్టాగ్రామ్ లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు అగ్నిహోత్రి పరోక్షంగా అతనిపై కౌంటర్లు వేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో కరణ్ జోహార్‌‌ పై ట్రోల్స్ రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పుడు నెట్టింట బాయ్ కాట్ బాలీవుడ్ బ్యాచ్ ఏర్పడటానికి ఒకరకంగా కరణ్ కూడా కారణమే అని చెప్పాలి.

యాక్టర్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన క‌ర‌ణ్ జోహార్.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి సక్సెస్ అయ్యాడు. ఇదే క్రమంలో నిర్మాత అవతారమెత్తిన ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకున్నాడు. ఆ తరవాత హోస్టుగా మారి 'కాఫీ విత్ కరణ్' వంటి సెలబ్రిటీ టాక్ షోను నిర్వహిస్తున్నాడు.

అయితే బాలీవుడ్‌ లో నెపోటిజంను ప్రోత్సహించాడంటూ కరణ్‌ జోహార్ పై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఎక్కువగా సినీ వారసుల పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకురావడంతో నెటిజన్లకు క‌ర‌ణ్ టార్గెట్ అవుతున్నాడు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం త‌ర్వాత అతను ఎక్కువగా నెగెటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఏ హిందీ సినిమా వ‌చ్చినా 'బాయికాట్ బాలీవుడ్' ట్రెండ్ కామన్ అవుతోంది.

ఇకపోతే కరణ్ జోహార్ చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నాడు. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రణ్‌ వీర్ సింగ్ - ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News