గత మూడేళ్లుగా సౌత్ లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులందరు ఎదురు చూస్తున్న 2.0 నవంబర్ 29 విడుదల కానుంది. ఈ విషయాన్నీ గతంలోనే ప్రకటించిన లైకా సంస్థ ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ ద్వారా సినిమాలో ఏముందో చూచాయగా ఓ సాంపుల్ చూపించారు. మహాద్భుతం అనే మాట రాలేదు కానీ శంకర్ మాయాజాలం మాత్రం స్పష్టంగా కనిపించింది. విడుదల మరో రెండు నెలల్లో ఉన్న నేపధ్యంలో శంకర్ మీడియాతో అందుబాటులోకి రావడం మొదలుపెట్టాడు.
అందులో భాగంగా ఒక ప్రముఖ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2.0 విశేషాలు షేర్ చేసుకున్న శంకర్ విచిత్రంగా బాహుబలి పదాన్ని పలకడానికి ఏ మాత్రం ఇష్టపడకపోవడం జక్కన్న ఫాన్స్ ని హర్ట్ చేసిందనే చెప్పాలి. బాహుబలి తర్వాత సౌత్ సినిమాల మార్కెట్ బాగా పెరిగింది కదా అన్న యాంకర్ అడిగిన ప్రశ్నకు సినిమా పేరు ప్రస్తావించకుండానే 2.0 హిందీ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించి మార్కెట్ ఇప్పుడున్న దానికి ఎన్నో రేట్లు పెంచుతుందని చెప్పాడు.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే శంకర్ తానుగా బాహుబలి సెట్ చేసిన బెంచ్ మార్క్ గురించి నేరుగా ప్రస్తావించడానికి ఇష్టపడటం లేదు. ఎంతసేపు సౌత్ సినిమాల టెక్నీకల్ స్టాండర్డ్స్ పెరిగాయి అని చెబుతున్నాడే తప్ప దానికి ప్రధాన కారణం బాహుబలి అని చెప్పడానికి మాత్రం ఆయన మనసు అంగీకరించడం లేదు. శంకర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాహుబలి సౌత్ సినిమా స్థాయిని అమాంతం పెంచింది అన్నది కాదనలేని సత్యం. జక్కన్న ఫ్యాన్స్ ఇంకో వెర్షన్ వినిపిస్తున్నారు. 2.0 టీజర్ కు బాహుబలి రేంజ్ స్పందన దక్కలేదని పోలికలు తెచ్చి మరీ కొందరు పెదవి విరుస్తుండటంతో ఆ ఫీలింగ్ తోనే బాహుబలి పేరుని చెప్పడానికి ఆయన ఇష్టపడకపోవచ్చని అంటున్నారు.
ఏదైతేనేం శంకర్ చాలా సినిమాలు తమిళ్ లో కంటే తెలుగులోనే గొప్పగా ఆడిన సంగతి మర్చిపోకూడదు. అలాంటప్పుడు సాటి తెలుగు సినిమా పేరును గొప్పదనాన్ని ఒప్పుకోవడంలో తప్పేముంది. అదే రాజమౌళి దగ్గర శంకర్ ప్రస్తావన తెస్తే చాలు కళ్ళలో మెరుపులు తెచ్చుకుని మరీ పొగుడుతాడు. అదే మరి వాళ్లకు మనకూ ఉన్న తేడా అంటే.